ఫేస్‌బుక్‌ లైవ్‌లపై ఇక ఆంక్షలు

30 Mar, 2019 10:54 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

క్రైస్ట్‌చర్చ్‌ నరమేధం నేపథ్యంలో ఫేస్‌బుక్‌ మరో కీలక నిర్ణయం

ఫేస్‌బుక్‌ లైవ్‌లను మానిటర్‌  చేయనున్న ఫేస్‌బుక్‌ 

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోప్యతా ఉల్లంఘనల ఆందోళన, న్యూజిలాండ్‌ నరమేధం సంఘటన తరువాత పలు సంస్కరణలకు పూనుకుంటోంది. ఇటీవల శ్వేత జాతీయవాద, వేర్పాటువాద పోస్టులను, ప్రసంగాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన సంస్థ తాజాగా మరో దిద్దుబాటు చర్యకు శ్రీకారం చుట్టింది.  ఇక పై ఫేస్‌బుక్‌ లైవ్‌లను  మానిటర్‌ చేయనుంది. ఈ మేరకు కొన్ని ఆంక్షలు విధించాలని కూడా నిర్ణయించింది.  అంటే ఇకపై ఫేస్‌బుక్‌ లైవ్‌లపై ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట.
 
క్రైస్ట్‌చర్చ్‌ ఊచకోత సంఘటన లైవ్‌ స్ట్రీమింగ్‌పై రేగిన దుమారం నేపథ్యంలో తన ప్లాట్‌పాంపై ప్రత్యక్ష ప్రసారాలను కట్టడి చేయనుంది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్‌ శుక్రవారం తన బ్లాగ్‌లో ప్రకటించారు. ప్రామాణిక ఉల్లంఘనలులాంటి అంశాలపై ఆధారఫడి ఫేస్‌బుక్‌లో ఎవరు లైవ్‌కు వెళ్లవచ్చు అనే విషయాన్ని ఫేస్‌బుక్‌ పరిశీలిస్తుందని ఆమె వెల్లడించారు. 

చదవండి : న్యూజిలాండ్‌ సంచలన నిర్ణయం

మృతుల్లో ఐదుగురు భారతీయులు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు