ఫేస్‌బుక్‌లో బయటపడ్డ మరో భద్రతాలోపం

22 Mar, 2019 05:54 IST|Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో: భద్రతా లోపం కారణంగా కొన్ని కోట్ల ఫేస్‌బుక్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లు ఎలాంటి ఎన్క్రిప్షన్‌ లేకుండా సాధారణ అక్షరాలుగానే సంస్థ అంతర్గత సర్వర్‌ల్లో స్టోర్‌ అయ్యాయని ఫేస్‌బుక్‌ గురువారం ఒప్పుకుంది. అలాంటి ఖాతాల సంఖ్య 60 కోట్లని విశ్వసనీయ సమాచారం. 20 వేల మంది తమ సంస్థ ఉద్యోగులకు ఆ పాస్‌వర్డ్‌లు కనిపించేవనీ, బయటి వారికి కాదని తెలిపింది. ఉద్యోగులు ఆ ఖాతాల్లోకి అనధికారికంగా లాగిన్‌ అయినట్లు కానీ, వాటిని దుర్వినియోగం చేసినట్లు కానీ తమకేమీ ఆధారాలు లభించలేదని సంస్థ ఇంజినీరింగ్, సెక్యూరిటీ, ప్రైవసీ విభాగాల ఉపాధ్యక్షుడు పెడ్రో కనహువాటి చెప్పారు. ఈ ఏడాది మొదట్లో సాధారణ భద్రతా తనిఖీలు చేస్తుండగా ఈ విషయం బయటపడిందన్నారు. ఇలా ఏయే ఫేస్‌బుక్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లు బయటకు కనిపించాయో ఆయా ఖాతాదారులకు దీనిపై త్వరలో ఓ నోటిఫికేషన్‌ కూడా పంపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు