ఆ న్యూస్‌పై ఫేస్‌బుక్‌ సీరియస్‌

5 Aug, 2018 18:12 IST|Sakshi
ఫేస్‌బుక్‌ గ్లోబల్‌ న్యూస్‌ పార్టనర్‌షిప్స్‌ హెడ్‌ బ్రౌనీ క్యాంప్‌బెల్‌ (ఫైల్‌ పోటో)

న్యూయార్క్‌ : తన ప్లాట్‌ఫాంపై తప్పుడు వార్తల ప్రచారానికి చెక్‌ పెట్టేందుకు ఫేస్‌బుక్‌ సంసిద్ధమైంది. ఇలాంటి కంటెంట్‌ను సృష్టించే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను (ఫైనాన్షియల్‌ ఇన్సెంటివ్స్‌) నిలిపివేస్తామని ఫేస్‌బుక్‌ అంతర్జాతీయ వార్తా భాగస్వామ్యాల అధిపతి క్యాంప్‌బెల్‌ బ్రౌన్‌ స్పష్టం చేశారు. ఫేస్‌బుక్‌ గత కొన్నేళ్లుగా పలు దేశాల్లో తప్పుడు, ఉద్దేశపూరిత కంటెంట్‌ వ్యాప్తి సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో తన యూజర్ల న్యూస్‌ ఫీడ్స్‌ను ప్రక్షాళన చేసేందుకు ఫేస్‌బుక్‌ బహుముఖ వ్యూహంతో ముందుకొచ్చింది.

ఫాల్స్‌ న్యూస్‌కు మూలకారణం ఆర్థిక ప్రయోజనాలు ఆశించడమే. వారి మూలాలకు చెక్‌ పెట్టడం ద్వారా దీనికి అడ్డుకట్ట వేయడమే తమ లక్ష్యమని బ్రౌన్‌ చెప్పుకొచ్చారు. నకిలీ అకౌంట్లను గుర్తించి వాటిని తొలగించడంపైనా దృష్టిసారించామన్నారు.

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ పాత్రపై విమర్శలు వెల్లువెత్తి అతిపెద్ద సోషల్‌ మీడియా దిగ్గజం చేతులు కాల్చుకున్న తర్వాత ఫేక్‌న్యూస్‌పై ఫేస్‌బుక్‌ తీవ్రంగా దృష్టిసారించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు