-

ప్రపంచంలోనే పెద్ద శ్మశానంగా మారనున్న ఫేస్బుక్!

8 Mar, 2016 21:22 IST|Sakshi
ప్రపంచంలోనే పెద్ద శ్మశానంగా మారనున్న ఫేస్బుక్!

లండన్ః సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ కొన్నాళ్ళకు శ్మశానంగా మారనుందట.  వినియోగదారుల సంఖ్య రోజురోజకూ పెరిగిపోతుండటంతో ఇంటర్నెట్ నిపుణులు ఇదే విషయంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోటిమందికి దాటిపోయిన యూజర్ల సంఖ్యపై అంచనాకు వచ్చిన నిపుణులు... 2098 సంవత్సరం నాటికి ఫేస్ బుక్ లో ఖాతాదారులకంటే మృతుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు.  

ఫేస్ బుక్ పేజీల్లో స్మృతుల పేజీలు దర్శనమివ్వడాన్ని బట్టి నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాతాదారులు మరణిస్తే ఆ పేజీని తొలగించే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ ఖాతాదారుడి వివరాలు తెలిసినవారు మరొకరుంటే తప్పించి దాన్ని ఎవ్వరూ లాగిన్ చేసే అవకాశం లేదు. దీంతో ఆ సామాజిక మాధ్యమంలో మరణించిన ఖాతాదారుడి పేజీని స్మృతుల పేజీగా మారుస్తున్న సంప్రదాయం కొనసాగుతోంది. అయితే అతడి కుటుంబ సభ్యులుగాని, స్నేహితులుగాని ఖాతాను కొనసాగిస్తుంటేమాత్రం ఆపేజీ బతికే ఉంటోంది. అమెరికా మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యార్థి హచెమ్ సాధిక్కి అదే నిర్థారించారు. ఫేస్ బుక్ లో వినియోగదారుల సంఖ్య ఇదే రీతిలో కొనసాగితే 2098 నాటికల్లా అదో శ్మశానంగా మారుతుందని అధ్యయనాలు చెప్తున్నట్లు పేర్కొన్నారు. మరణించినవారి ఖాతాలను సైతం ఆ నెట్వర్క్ ఇదే విధంగా కొనసాగిస్తే సంస్థ వృద్ధి రేటు సైతం భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు.

అయితే ఆన్లైన్ లెగసీ ప్లానింగ్ కంపెనీ 'డిజిటల్ బియాండ్' లెక్కల ప్రకారం చూస్తే ఈ ఏడు ప్రపంచంలో  ఫేస్ బుక్ వినియోగదారులు 9,70,000 మంది మరణించనున్నట్లు తెలుస్తోంది. అదే 2010 లో 3,85,368 మంది, 2012 లో  5,80,000  మరరణించినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీంతో కొనసాగించని ఖాతాలనుగాని, మరణించినవారి ఖాతాలను గాని ఫేస్ బుక్ స్వచ్ఛందంగా తొలగించేందుకు ముందుకు రాకపోవడంతో కొంతకాలానికి బతికున్నఖాతాదారులకంటే మరణించినవారి సంఖ్యే పెరిగిపోతుందని అధ్యయనాలద్వారా తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఫేస్ బుక్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్తులు, డబ్బులకు సంబంధించిన డాక్యుమెంట్లలో నామినీలను నియమించినట్లు... తమ ఖాతా వివరాలు తెలిసిన మరొకరిని నియమించుకోవాలని ఫేస్ బుక్ యూజర్లకు సూచించే ఉద్దేశ్యంలో ఉంది. ఈ పద్ధతిలో మరణించినవారి లెక్కల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

మరిన్ని వార్తలు