ఇండియాలో ఫేస్బుక్దే హవా!

6 Oct, 2015 20:52 IST|Sakshi
ఇండియాలో ఫేస్బుక్దే హవా!

న్యూఢిల్లీ: భారత్లో సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ దూసుకుపోతున్నది. 51శాతం యూజర్లతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్గా నిలిచింది. అదేవిధంగా ఇన్స్టంట్ మెసెజింగ్ యాప్స్ విషయంలో వాట్సాప్ 56శాతం యూజర్లతో ముందంజలో ఉంది. "కనెక్టెడ్ లైఫ్' పేరిట అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ టీఎన్ఎస్ జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 దేశాలకు చెందిన 60,500 మంది ఇంటర్నెట్ యూజర్ల డిజిటల్ మనస్తత్వం, ప్రవర్తనలపై టీఎన్ఎస్ అధ్యయనం జరిపి ఓ నివేదిక వెల్లడించింది. భారత్లో సోషల్ మార్కెటింగ్ వ్యాపారమంతా ఫేస్బుక్ కేంద్రంగా సాగుతున్నదని, దీంతో ఫేస్బుక్లోనూ వ్యక్తిగత సందేశాలు భారీగా ఉంటున్నాయని, అయితే ఇన్స్టంట్ మెసెజింగ్ విషయంలో మాత్రం వాట్సాపే ముందుంజలో ఉందని టీఎన్ఎస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరిజత్ చక్రవర్తి తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మూడోవంతుమంది (30%) యూజర్లతో ఫేస్బుక్ ప్రజాదరణలో మొదటిస్థానంలో ఉంది. అయితే ప్రతిరోజు ఫేస్బుక్లో లాగిన్ అయ్యేవారి సంఖ్య ఆసియా పసిఫిక్లో భారీగా ఉంది. ఫేస్బుక్ వినియోగం విషయంలో భారత్లో 51శాతం ఉండగా, ఆసియా పసిఫిక్ దేశాలైన థాయ్లాండ్ (78%), తైవాన్ (72%), హాంకాంగ్ (72%)లో ఇంకా అత్యధికశాతం ఉండటం గమనార్హం.

 

మరిన్ని వార్తలు