లాక్‌డౌన్ గురించి ఫేక్ న్యూస్‌ వైరల్‌

6 Apr, 2020 19:17 IST|Sakshi

సోష‌ల్ మీడియాలో షికారు చేసే వార్త‌ల్లో ఏవి వాస్త‌వాలో ఏవి అవాస్త‌వాలో అర్థం కాకుండా ఉన్నాయి. అయితే అందులో ఎక్కువ‌గా ఫేక్ వార్త‌లే వీర‌విహారం చేస్తున్నాయ‌ని, కేవ‌లం 10 శాతం మాత్ర‌మే నిజ‌మైన‌వి ఉంటున్నాయ‌ని ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. అంతేకాక‌ ఇప్ప‌టికీ చాలామంది ప‌త్రిక‌ల‌నే విశ్వ‌సిస్తున్నార‌ని, అందులో వ‌చ్చే వార్త‌ల‌పైనే ఆధార‌ప‌డుతున్నార‌ని వివ‌రించింది. ఇదిలా ఉండ‌గా మ‌రో అస‌త్య వార్త వాట్సాప్‌ను ఊపేస్తోంది. ఇప్ప‌టికే భార‌త ప్ర‌భుత్వం జ‌న‌తా క‌ర్ఫ్యూ, ఆ త‌ర్వాత 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించ‌గా.. నెక్స్ట్ ఏంటి? అని జ‌నాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 

ముఖ్యంగా ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేస్తారా లేదా అన్న గంద‌ర‌గోళంలో ఉన్నారు. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేయ‌డం లేద‌ని, పైగా ద‌శ‌ల వారీగా పొడిగించాలంటూ ఏకంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్‌వో) సూచిస్తున్న‌ట్లుగా ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన స‌ద‌రు సంస్థ అది అస‌త్య ప్ర‌చార‌మ‌ని, నిరాధార‌మైన‌ద‌ని కొట్టిపారేసింది. లాక్‌డౌన్ గురించి అలాంటి ప్ర‌త్యేక ప‌ద్ధ‌తిని ఏదీ మేము త‌యారు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఫేక్ న్యూస్ ఏం చెప్తోందంటే...
లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డానికి ముందుగా ఒక‌రోజు ట్ర‌య‌ల్(మార్చి 21) నిర్వ‌హిస్తారు. త‌ర్వాత మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు (21 రోజులు) లాక్‌డౌన్ విధిస్తారు. ఆ త‌ర్వాత ఐదు రోజులు ప్ర‌భుత్వం విరామం ప్ర‌క‌టిస్తుంది. అనంత‌రం ఏప్రిల్ 20 నుంచి మే 18 వ‌ర‌కు(28 రోజులు) రెండోసారి లాక్‌డౌన్ అమ‌లు చేస్తారు. క‌రోనా తీవ్ర‌త త‌గ్గ‌క‌పోతే ఐదురోజులు బ్రేక్ ఇచ్చి తిరిగి మూడోసారి లాక్‌డౌన్ అమ‌లు చేయక తప్ప‌దు. అంటే.. మే 25 నుంచి జూన్ 10 వర‌కు(15 రోజులు) ఆఖ‌రుసారిగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంది. (లాక్‌డౌన్‌ వేళ నగరంలోనయా ట్రెండ్‌..)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు