నాన్నలే.. నేపీలు మారుస్తున్నారు

24 Mar, 2016 03:42 IST|Sakshi
నాన్నలే.. నేపీలు మారుస్తున్నారు
లండన్: సాధారణంగా పిల్లల ఆలనాపాలనా అంతా తల్లే చూస్తుంది. చంటి పిల్లలు రాత్రిళ్లు ఏడ్చినా, నిద్రపోకుండా అల్లరి చేసినా లాలించో, ఆడించో జో కొట్టి నిద్ర పుచ్చడం, నేపీలు మార్చడం వంటి బాధ్యతలను తల్లులే నిర్వర్తిస్తారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పుడు గుర్రుపెట్టి నిద్రపోయే నాన్నలు.. ఇప్పుడు రాత్రిళ్లు పిల్లల నేపీలు మార్చే పనిలో పడి నిద్రను మరచిపోతున్నారట.


బ్రిటన్‌లో అర్ధరాత్రి పూట చంటిబిడ్డల నేపీలు మార్చేందుకు తల్లుల కంటే తండ్రులే అధికంగా నిద్రలేస్తున్నారట. ప్రతి పది మంది తండ్రుల్లో ఏడుగురు.. పిల్లల ఆలనాపాలనా చూసేందుకు రాత్రిపూట నిద్ర లేస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అదే తల్లుల విషయానికి వస్తే ప్రతి ముగ్గురిలో ఇద్దరు మాత్రమే ఆ బాధ్యత తీసుకుంటున్నట్లు తేలింది. మొత్తం మీద నాన్నల పాత్ర క్రమేపీ పెరుగుతోందని తాజా సర్వే వెల్లడించింది.

మరిన్ని వార్తలు