కన్నుల్లో నీ వ్యక్తిత్వమే..

30 Jul, 2018 03:05 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ప్రేమ, ద్వేషం, కోపం, ఈర్ష్య, సిగ్గు ఇలా మన కళ్లు అనేక భావాలను అందంగా పలికించగలవు. అందుకేనేమో.. గుండెల్లో ఏముం దో కళ్లలో తెలుస్తుంది.. అంటాడు ఓ సినీ గేయ కవి. నయనాలు.. నవరసాలను మాత్రమే కాదు మనిషి వ్యక్తిత్వాన్ని కూడా తెలుపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కళ్లను చదివి.. ఓ మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే కొత్త తరహా కృత్రిమ మేధస్సును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నూతన సాంకేతిక కళ్ల కదలికలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుందని అంటున్నారు.

జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ స్టుట్గార్ట్, ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ వర్సిటీకి చెందిన పరిశోధకులు స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ను ఉపయో గించి కళ్ల కదలికలు, వ్యక్తిత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు ఈ అధ్యయనా న్ని చేపట్టారు. దీనిలో భాగంగా 42 మంది వ్యక్తు లను ఎంపిక చేసుకుని నిర్దిష్టమైన ప్రశ్నలతో పాటు రోజువారీ పనుల్లో వారి కళ్ల కదలికలను నమోదు చేసుకున్నారు. ముఖ్యమైన 5 వ్యక్తిత్వ లక్షణాల్లో 4 లక్షణాలను కచ్చితంగా ఈ సాఫ్ట్‌వేర్‌ గుర్తించిందని తెలిపారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు