సొమ్మును బట్టే సంసార బంధం

25 May, 2016 14:31 IST|Sakshi
సొమ్మును బట్టే సంసార బంధం

అందమైన అమ్మాయి.. హేండ్సమ్ కుర్రాడు.. మనసులు కలిశాయి.. కానీ ఆ బంధం మాత్రం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకంటే, అవతలివాళ్ల దగ్గర సొమ్ములు నిల్ అని తేలిపోయింది. అవును, ఇప్పుడు చాలావరకు సంబంధాలు ఆర్థిక స్థోమతను బట్టే ఆధారపడి ఉంటున్నాయట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇద్దరు మనుషులు కలవాలంటే అవతలివాళ్లు ఎంత ధనవంతులు అన్నదే ప్రధానంగా చూస్తున్నారట. ఇద్దరి మధ్య బాగా అవగాహన ఉంటే బాగుంటుందని ఇంతకుముందు అనుకునేవాళ్లని, కానీ ఇప్పుడు మాత్రం డబ్బుకు ప్రాధాన్యం బాగా ఎక్కువ ఇస్తున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రొమాంటిక్ సంబంధాలు కూడా దీనిమీదే ఆధారపడుతున్నాయని అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌కు చెందిన ప్రొఫెసర్ డారియస్ చాన్ దీనిపై తమ పరిశోధన వివరాలను వెల్లడించారు. ఇందుకోసం చైనాలోని కాలేజి విద్యార్థులను రెండు గ్రూపులుగా చేసి పరిశోధన చేశారు. అప్పటికే దీర్ఘకాలిక లైంగిక సంబంధాలు ఉన్నవారిని ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు. ఒక గ్రూపు వారిని బాగా డబ్బుందని అనుకోవాలని, మరో గ్రూపువారిని బాగా పేదలు అనుకోవాలని చెప్పారు. బాగా ధనవంతులమని అనుకున్న కుర్రాళ్లు, తమ భాగస్వామి శారీరక అందంతో అంతగా సంతృప్తి చెందలేదట. వాళ్లతో సంబంధాలను తక్కువ కాలమే కొనసాగించాలని అనుకున్నారట.

తాము ధనవంతులమని అనుకున్న అమ్మాయిలు కూడా అబ్బాయిల శారీరక లక్షణాలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదట. అదే అటూ ఇటూ కూడా ధనవంతులమని అనుకున్న వాళ్లలో మాత్రం అవతలి వాళ్ల మీద ఆకర్షణ చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బాగా డబ్బున్న అమ్మాయిలు తమ భాగస్వామి శారీరక ఆకర్షణకు ప్రాధాన్యం ఇచ్చారని, అయితే డబ్బు తక్కువగా ఉంటే మాత్రం వాళ్లతో స్వల్పకాలిక సంబంధాలనే కోరుకున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు