నెల వయసులోనే గుర్తించొచ్చు!

14 Sep, 2016 02:20 IST|Sakshi
నెల వయసులోనే గుర్తించొచ్చు!

లాస్ ఏంజిలెస్: నెల వయసున్న పసికందుల జీర్ణాశయంలో సూక్ష్మజీవులు ఉంటే బాల్యంలో ఆస్తమా, ఇతర అలర్జీలకు గురయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువని అధ్యయనంలో  తేలింది.  అధ్యయనం ఫలితాలు  కొత్త చికిత్స అభివృద్ధికి దోహదం చేస్తాయని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సుసాన్ లించ్ తెలిపారు.

ఆస్తమా వ్యాధి నిర్ధారణ పిల్లల్లో ఏడేళ్ల వయసులో జరుగుతుందని, దీనికి చికిత్సా విధానం లేకపోవడంతో మందులు తీసుకోవాల్సి ఉంటుందని  ఒక నెల వయసున్న పసికందుల జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవులు రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, తదుపరి మూడేళ్ల వయసులో అలర్జీలకు, నాలుగేళ్ల వయసులో ఆస్తమాకు దారి తీస్తాయని పరిశోధకులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు