‘వరల్డ్‌ హ్యాపియెస్ట్‌ కంట్రీ’గా ఫిన్‌లాండ్‌.. మరి భారత్..?

20 Mar, 2020 20:40 IST|Sakshi

బ్లూమ్‌బర్గ్‌: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం (హ్యాపీయెస్ట్‌ కంట్రీ)గా ఫిన్‌లాండ్ వరుసగా మూడోసారి రికార్డుల్లోకి ఎక్కింది. మార్చి 20న వరల్డ్‌ హ్యాపినెస్‌ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సుమారు 156 దేశాల ప్రజల జీవన స్థితిగతులు, సంతోషకరమైన జీవనశైలిని పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటి అంశాల్లో ఫిన్‌లాండ్‌ ప్రజలు సంతోషంగా ఉన్నారని పరిశోధనలో వెల్లడైంది. చదవండి: కరోనా: 'నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయి'

సంతోషకర నగరాల జాబితాలో ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకి టాప్‌లో నిలిచింది. ఇక అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఆఫ్గనిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా విషయానికి వస్తే అతి తక్కువ సంతోషంగా ఉన్న నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. అయితే అతి తక్కువ సంతోషంగా ఉన్న నగరాల జాబితాలో ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా నగరాల విషయానికి వస్తే అతి తక్కువ సంతోషకర నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ ఏడవ స్థానంలో నిలిచింది. కాగా.. ఫిన్‌లాండ్‌లో ఉండే విస్తారమైన అడవులు, వేల సంఖ్యలో సరస్సులు అక్కడి వాసులు ఆహ్లాదకర, సంతోషకరమైన వాతావరణంలో ఉండేలా ఉపకరించాయని తెలిసింది. ఇక జింబాబ్వే, సౌత్‌ సూడాన్‌, అప్ఘనిస్తాన్‌ ప్రపంచలోనే అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి. చదవండి: ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ?

మరిన్ని వార్తలు