ట్రంప్‌ టవర్స్‌లో అగ్ని ప్రమాదం

8 Jan, 2018 19:08 IST|Sakshi
అగ్నిప్రమాదం జరిగిన ట్రంప్‌ టవర్స్‌

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ట్రంప్‌ టవర్స్‌లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రంప్‌ టవర్స్‌లో పలు కార్యాలయాలతో పాటు, సాధారణ నివాసాలు కూడా ఉన్నాయి.

టవర్స్‌ పై అంతస్తులో ప్రమాదం జరగడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికీ అపాయం కలుగలేదని రిపోర్టులు వస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు