స్వలింగ సంపర్కంతో డెంగ్యూ వైరస్‌ వ్యాప్తి

11 Nov, 2019 10:00 IST|Sakshi

మాడ్రిడ్‌: స్వలింగ సంపర్కం ద్వారా డెంగ్యూ వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని స్పెయిన్‌ వైద్యులు తొలిసారిగా గుర్తించారు. మాడ్రిడ్‌ నగరానికి చెందిన 41 ఏండ్ల ఓ స్వలింగ సంపర్కుడు డెంగ్యూ సోకిన తన సహచరుడితో లైంగిక చర్యలో పాల్గొనడంతో అతనికి కూడా డెంగ్యూ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా సదరు వ్యక్తి సహచరుడు క్యూబా పర్యటనలో ఉండగా అతనికి డెంగ్యూ వైరస్‌ సోకినట్టు మాడ్రిడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు. అయితే తొలుత దోమకాటు కారణంగా డెంగ్యూ సోకిందని భావించిన వైద్యులు.. వివిధ రకాల వైద్య పరీక్షల అనంతరం అసలు నిజం వెల్లడైంది. అయితే స్వలింగ సంపర్కం ద్వారా డెంగ్యూ సోకడం ఇదే తొలిసారి అని వైద్యు‍లు అభిప్రాయపడుతున్నారు. కాగా గత కొంతకాలంగా భారత్‌ పాటు ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.  ఈ వైరస్‌ భారీనపడి ఇప్పటికే అనేకమంది మృత్యువాత పడ్డారు.

మరిన్ని వార్తలు