‘యూఎస్‌, రష్యా మధ్య అణుయుద్ధం జరగొచ్చు’

7 Apr, 2017 13:27 IST|Sakshi
‘యూఎస్‌, రష్యా మధ్య అణుయుద్ధం జరగొచ్చు’

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యను హవాయిన్‌ ప్రాంతం నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమొక్రాట్‌ తులసీ గబార్డ్‌ తప్పుబట్టారు. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్లక్ష్యపూరితంగా ట్రంప్‌ సిరియాపై దాడి చేయించారని మండిపడ్డారు. వారికి అసలు దూరదృష్టే లేదని విమర్శించారు.

‘ఈ పాలన వర్గం(ట్రంప్‌ ప్రభుత్వం) నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సిరియాపై దాడులు చేస్తే తదుపరి జరగబోయే పరిణామాలు ఏమిటనే విషయంలో ఎవరినీ సంప్రదించలేదు. అదీ కాకుండా అసలు సిరియాలో జరిగింది కెమికల్‌ దాడులా కాదా అని నిర్ధారించుకోలేదు. ఇవేం చేయకుండానే ఏకపక్షంగా దాడి చేయడం సరికాదు. ట్రంప్‌ చేసిన ఈ పని నాకు చాలా బాధను, కోపాన్ని కలిగించింది. ఇది అల్‌ కయిదాను మరింత బలోపేతం చేస్తోంది. వారు ఇంకెంతోమంది సిరియాలోని అమాయకులను పొట్టనపెట్టుకోవచ్చు. ఎంతోమందిని శరణార్థులుగా మార్చవచ్చు. అంతేకాదు, అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం కూడా జరిగే అవకాశం ఉంది’ అంటూ ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు