పాక్‌ చరిత్రలో తొలిసారి..

6 May, 2020 19:14 IST|Sakshi

పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ఆర్మీలో తొలిసారిగా మైనారిటీ వర్గానికి చెందిన ఓ హిందూ యువకుడు నియమితులయ్యారు. సైన్యంలో రాహుల్‌ దేవ్‌ను జనరల్‌ డ్యూటీ పైలట్‌ అధికారిగా నియమించామని పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (పీఎఫ్‌ఏ) ట్వీట్‌ చేసింది. రాహుల్‌ స్వస్థలం సింథ్‌ ప్రావిన్స్‌లోని థర్పర్కర్‌. రాహుల్‌ ఫోటోను పీఏఎఫ్‌ షేర్‌ చేస్తూ కోవిడ్‌-19 సంక్లిష్ట పరిస్ధితుల్లో గుడ్‌న్యూస్‌ను పంచుతున్నాం..థర‍్పక్కర్‌ అనే మారుమూల గ్రామం నుంచి రాహుల్‌దేవ్‌ ఆర్మీలో జీడీ పైలట్‌గా ఎంపికయ్యారని ట్వీట్‌ చేసింది. పాకిస్తాన్‌ చరిత్రలోనే తొలిసారిగా పీఏఎఫ్‌లో ఓ హిందూ యువకుడు జనరల్‌ డ్యూటీ పైలట్‌ అధికారిగా నియమితులయ్యారని పాక్‌ అధికారిక రేడియో బుధవారం ప్రకటించింది.

చదవండి : కరోనా కాలంలో పాక్‌ కుట్రలు

>
మరిన్ని వార్తలు