తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

18 Jul, 2019 09:19 IST|Sakshi

తొలిసారి విమానం ఎక్కబోతున్నామంటే.. ఎవరికైనా సహజంగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. విమానం ఎలా ఎక్కాలి? విమానాశ్రయం ఎలా ఉంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే, తొలిసారి అనుభూతి మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. కానీ, ఈ మహిళకు మాత్రం తొలిసారి విమానాశ్రయం వెళ్లడం భయానక అనుభవంగా మిగిలిపోయింది. ఆమె తొలిసారి విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ లగేజ్‌ లాక్కెళ్లే.. కన్వేయర్‌ బెల్ట్‌ను చూసి.. దానిపై నిలబడితే.. నేరుగా జెట్‌ విమానం దగ్గరికి వెళ్లొచ్చని అనుకున్నారు.

అంతే, తన లగేజీ పట్టుకొని.. కదులుతున్న ఆ బెల్ట్‌పైకి దూకేశారు. దాంతో బ్యాలెన్స్‌ తప్పి దభేలున కిందపడ్డారు. అక్కడే ఉన్న ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఇది గమనించి.. వెంటనే కన్వేయర్‌ బెల్ట్‌ను ఆపేయడంతో ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. టర్కీ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కన్వేయర్‌ బెల్ట్‌పై నిలబడితే.. విమానం దగ్గరికి వెళ్లొచ్చుని భావించి.. దానిపైకి ఎక్కినట్టు అనంతరం ఆ మహిళ చెప్పారు. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో ఇప్పుడు సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు