అమెరికాలో ఐదుగురు భారతీయుల అరెస్ట్‌

22 Nov, 2019 04:48 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన ఐదుగురు భారతీయులను న్యూయార్క్‌ అధికారులు నిర్బంధించారు.  15న ఓ అమెరికన్‌ తన వాహనంలో ఐదుగురు భారతీయులను తీసుకువస్తూ మోరిస్‌టౌన్‌ చెక్‌పాయింట్‌ను దాటేందుకు యత్నించాడు. అధికారులు అనుమానించడంతో ఆ వాహనాన్ని సమీపంలోని దుకాణం వద్ద ఆపాడు. దీంతో అందులో ఉన్న భారతీయులు దుకాణంలోకి వెళ్లి దాక్కున్నారు. అధికారులు లోపలికి వెళ్లి తనిఖీ చేయగా వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవని తేలింది. దీంతో ఆ ఐదుగురినీ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో భారతీయుల సంఖ్య 9 వేలకు పైమాటే.

లండన్‌లో ఐదుగురు భారతీయులు
లండన్‌: డ్రగ్స్, మనీ లాండరింగ్‌ దందా నడుపుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును బ్రిటన్‌ దర్యాప్తు విభాగం రట్టు చేసింది. ఇందుకు సంబంధించి అరెస్టయిన 10 మందిలో ఐదుగురు భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరంతా కలిసి మూడేళ్లలో 15.5 మిలియన్‌ పౌండ్లను (రూ.143 కోట్లు) దుబాయికి దొంగతనంగా సూట్‌కేసుల్లో తరలించి, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు