‘వీడిని తాకట్టు పెట్టుకోండి; రేటు ఎంత?’

11 May, 2019 09:10 IST|Sakshi

ఫ్లోరిడా : ‘నాకు ఉన్న ఆస్తి వీడు. వయస్సు ఏడున్నర నెలలు. వీడిని మీరెలాగనైనా ఉపయోగించుకోవచ్చు. చెప్పండి ఎంతకు తాకట్టు పెట్టుకుంటారు. వీడి విలువ ఎంత’ అంటూ ఓ వ్యక్తి తన కుమారుడి గురించి షాపు వాళ్లతో బేరసారాలకు దిగాడు. ఇది గమనించిన ఓ షాపు యజమాని పోలీసులకు సమాచారమివ్వడంతో తాను ప్రాంక్‌ వీడియో రూపొందించేందుకే ఇలా చేశానంటూ తాపీగా సమాధానమిచ్చాడు. ఈ ఘటన ఫ్లోరిడా గల్ఫ్‌ కోస్ట్‌లో చోటుచేసుకుంది. వివరాలు... ఫ్లోరిడాకు చెందిన రిచర్డ్‌ స్లోకమ్‌ సింగిల్‌ పేరెంట్‌. అతడికి నెలల వయస్సు గల బాబు ఉన్నాడు. సరదాగా వీడియోలు రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే అలవాటు ఉన్న రిచర్డ్‌ ఓ రోజు కొడుకు వెంటేసుకుని ఓ షాపులోకి వెళ్లాడు. బాబు ఎంత విలువ చేస్తాడంటూ షాపు ఓనరును అడగటంతో అతడు అవాక్కయ్యాడు. అయితే తాను సరదాగా అన్నానని వెళ్లొస్తా అంటూ రిచర్డ్‌ షాపు నుంచి బయటికి వచ్చాడు. రిచర్డ్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని అతడి వెనకే వెళ్లగా.. మిగతా వాళ్లను కూడా ఇలాగే అడగటం గమనించాడు. దీంతో అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు.

ఈ క్రమంలో షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రిచర్డ్‌ కోసం పోలీసులు వెదకడం ప్రారంభించారు. అతడి గురించి వాకబు చేసేందుకు ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కంగుతిన్న రిచర్డ్‌ వెంటనే పోలీసు స్టేషనుకు పరిగెత్తాడు. తాను ప్రాంక్‌ వీడియో కోసమే ఇలా చేశానంటూ వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో అతడి గురించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పోలీసులు విడిచిపెట్టారు. ఈ విషయం గురించి షాపు యజమాని మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడే వారికి సరైన శిక్ష విధిస్తేనే.. కుదురుగా ఉంటారంటూ రిచర్డ్‌ తీరుపై మండిపడ్డాడు. తాను ఇలాంటి విషయాలను తేలికగా తీసుకోలేనని, అందుకే పోలీసులకు ఫోన్‌ చేశానని చెప్పుకొచ్చాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చైనాలో వరుస భూకంపాలు

తొందర్లోనే వెళ్లగొడతాం

భూ ప్రకంపనలు: సునామీ హెచ్చరికలు

20 లక్షల మంది మధ్య ఓ అంబులెన్స్‌

కెనడాలో కాల్పుల కలకలం

చూపు కోల్పోనున్న చిన్నారి.. పాపం ఫోన్‌దే 

‘నాసా’లో భారతీయులు అతి తక్కువ!

2027 నాటికి మనమే టాప్‌

చైనాలో భూకంపం.. 122 మంది..

నైజీరియాలో ఆత్మాహుతి దాడి

10 రోజుల్లో ‘అణు’ పరిమితిని దాటేస్తాం

భారత్‌ వద్ద పెరుగుతున్న అణ్వాయుధాలు

మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు

కోర్టు హాల్లో మోర్సీ మృతి

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

ఐఎస్‌ఐ చీఫ్‌గా ఫైజ్‌ హమీద్‌

ఇజ్రాయెల్‌ ప్రధాని భార్యకు జరిమానా

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో దారుణం

ఇరాన్‌ను వదలం: ట్రంప్‌

పుర్రె ఎముకలు పెరుగుతున్నాయి

‘పిల్లి’మంత్రి ప్రెస్‌మీట్‌.. నవ్వలేక చచ్చిన నెటిజన్లు

కూతురి కోసం ఓ తండ్రి వింత పని..

అనుకోకుండా ఆ మొక్కను తగిలాడు అంతే..

బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి

అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి

వయసు 21 చుట్టొచ్చిన దేశాలు 196

అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే! 

ఆ దేశాలే బాధ్యులు

ఇమ్రాన్‌.. ఏంటిది; ఆరోగ్యం బాగాలేదేమో!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు

ఇది షాహిద్‌ సినిమా కాదు!

ప్రతి సీన్‌లో మెసేజ్‌

సంచలనాల ఫకీర్‌