ఏమి ఆట: కరోనా కాలంలో బొమ్మలాట!

1 Jun, 2020 11:38 IST|Sakshi

బెర్లిన్‌ : జర్మనీలోని రెండు టీంల మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. హోరాహోరీగా సాగుతోంది.. వేలాది మంది ఫ్యాన్స్‌ కేరింతలు కొడుతున్నారు.. ఏంటి? ఈ కరోనా కాలంలో ఇంత మంది ఒకేచోట భౌతిక దూరం లేకుండా గుమికూడటం.. సర్వనాశనమే అని అనుకుంటున్నారా? ఓసారి సరిగ్గా లుక్కేసుకోండి.. ఇప్పుడు విషయం అర్థమైందా? అక్కడున్నది ఫ్యాన్స్‌ కాదు.. వాళ్ల బొమ్మలని..!  ఆదివారం కరోనా వైరస్‌ నుంచి కోలుకుని కొద్దిగా కుదుటపడ్డాక మెంచెన్‌గ్లద్బాలో ‘‘బన్‌దెస్లిగా’’ పేరిట ఫుట్‌ బాల్‌ లీగ్ మొదలైంది.‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అభిమానులు లేని లోటు తీర్చేందుకు ఇలా కార్డ్‌బోర్డులపై 12వేల బొమ్మలను ఏర్పాటు చేసి మ్యాచ్‌ను‌ నిర్వహించారు. ఒక్కో కార్డుబోర్డు ఫొటో కోసం అభిమానులనుంచి 19 యూరోలు సేకరించారు నిర్వాహకులు. ప్రస్తుతం ఆ స్టేడియంలో ఆటగాళ్లు, ఇతర సిబ్బంది, అధికారులతో కలిపి 213 మంది మాత్రమే ఉంటున్నారు. ( 'భార‌త్ మ‌రింత అందంగా క‌నిపిస్తుంది' )

>
మరిన్ని వార్తలు