రెండు కాళ్లు లేకున్నా కే 2ని అధిరోహించి..

15 May, 2016 14:39 IST|Sakshi
రెండు కాళ్లు లేకున్నా కే 2ని అధిరోహించి..

ఈక్వెడార్: పర్వత శిఖరాల అధిరోహణ అతి కొద్దిమందికే సాధ్యమవుతుంది. అది కూడా ఒంట్లో అవయవాలన్నీ సక్రమంగా ఉంటేనే. లేదంటే అతి కష్టంమీద ఆ ప్రయాణం సాగుతుంది. శరీరం పూర్తి స్థాయిలో సహకరిస్తే తప్ప అలాంటి సాహసాలు చేయడం సుసాధ్యం కాదు. కానీ, ఈక్వెడార్ కు చెందిన సాహసికుడు తి రెండు కాళ్లు లేకుండా కృత్రిమ కాళ్ల సహాయంతో ప్రపంచంలో ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కే 2 పర్వతాన్ని అధిరోహించాడు. అది కూడా ఆక్సిజన్ సహాయం కూడా లేకుండా. ఈ రికార్డుతో ప్రపంచంలోనే ఇలాంటి పరిస్థితులతో ఉండి కే 2ను అధిరోహించిన తొలి సాహసికుడిగా అతడు నిలిచాడు.

ప్రముఖ సాహసికుడు శాంటియాగో క్వింటరో 2002లో అర్జెంటీనాలోని ఓ పర్వత శిఖరాన్ని అధిరోహించే క్రమంలో అతడి రెండు కాళ్లు దెబ్బతిని చచ్చుబడిపోవడంతో వాటిని తొలగించారు. కానీ, అతడి లక్ష్యం మాత్రం అంతటితో ఆగిపోలేదు. గతంలో మౌంట్ ఎవరెస్టు ఎక్కిన అతడు ఈసారి వినూత్నంగా కే 2ను అధిరోహించి భళా అనిపించుకున్నాడు. 'నాకు వైద్యం చేసిన వాళ్లు నన్ను 5000 మీటర్ల ఎత్తుకు ఎక్కలేనని అన్నారు. కానీ, నేను ఏంటనే విషయం ఎవరూ చెప్పలేరు. నేను తీసుకున్న నిర్ణయం ప్రకారమే నేను ఉండాలని అనుకుంటా' అని ఆయన చెప్పారు. గతంలో ఇతడు మౌంట్ ఎవరెస్టును కూడా క్వింటెరో అధిరోహించాడు.

>
మరిన్ని వార్తలు