మాజీ ప్రధానికి పదేళ్ల జైలు

12 Dec, 2015 17:06 IST|Sakshi
మాజీ ప్రధానికి పదేళ్ల జైలు

ఆస్తానా: కజకిస్థాన్ మాజీ ప్రధాని సెరిక్ అఖ్ మెతోవ్ కటకటాలపాలయ్యాడు. అక్కడి కోర్టు ఆయనకు పదేళ్ల జైలు శిక్షను విధించింది. గౌరవ ప్రదమైన ప్రధాని బాధ్యతలు నిర్వర్తించిన ఓ వ్యక్తి ఆ దేశంలో జైలు శిక్షను అనుభవించడం ఇదే తొలిసారి. తాను అధికారంలో ఉన్నప్పుడు సెరిక్ నాలుగు అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడని గత కొద్ది కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

అయితే, తాను ఏ తప్పు చేయలేదని, ఈ విషయంలో కావాలనే కొందరు వ్యక్తులు తనపై కుట్ర చేశారని, క్షమించాల్సిందిగా అధ్యక్షుడు నర్సుల్తాన్ నబర్ బయేవ్ కు అర్జి పెట్టుకున్నారు. కానీ, అధ్యక్షుడు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించారు. ఈ కేసు తుదివాదనలు శనివారం జరిపిన కోర్టు చివరకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. మొత్తం 17మంది ఈ కేసుల్లో ఉండగా.. ముగ్గురు వ్యక్తులు బయటపడ్డారు. మిగితా వారందరికీ వారి నేరాలనుబట్టి శిక్ష ఖరారైంది.

మరిన్ని వార్తలు