మెక్సికన్ మాజీ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!

9 Feb, 2016 17:56 IST|Sakshi
మెక్సికన్ మాజీ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!

రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్పై మెక్సికన్ మాజీ అధ్యక్షుడు ఫెలిపె కాల్డెరోన్ విరుచుకు పడ్డారు. ట్రంప్ ప్రచార ప్రణాళికపై స్పందించిన కాల్దెరోన్.. తీవ్ర పదజాలంతో విమర్శించారు. సరిహద్దు గోడ నిర్మాణాకి ఒక్క సెంట్ కూడా చెల్లించేది లేదని.. అదో స్టుపిడ్ వాల్ అని అన్నారు. బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం యాంఛెన్ వెళ్ళిన కాల్దెరోన్.. ఆ వాల్ నిర్మాణ ప్రయత్నం ఎందుకూ పనికి రానిదన్నారు. అంతేకాక అధ్యక్ష పదవికి ట్రంప్ సరిపోడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ పోటీపై కాల్డెరోన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. ఓ ప్రశంసనీయ సమాజం ఉన్న ఆమెరికాలో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ రేస్లో ట్రంప్ వంటి అభ్యర్థులు పోటీ పడటం నమ్మలేకపోతున్నామంటూ తన అయిష్టాన్ని వెళ్ళగక్కారు. ట్రంప్ బాగా చదువుకున్న మనిషే అయినా అధ్యక్ష పదవికి తగ్గ తెలివితేటలు లేవన్నారు.  కాగా తన ప్రచారంలో ట్రంప్... సరిహద్దు సమస్యలు, ఇమ్మిగ్రేషన్లను ప్రధాన అజెండాలుగా చేసుకున్నారని, మెక్సికో ...రేపిస్టులను, క్రిమినల్స్ను బరిలోకి పంపిస్తోందంటూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. అంతేకాకుండా  ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ సమస్యలను ప్రచార సాధనంగా ఎంచుకోవడాన్ని కాల్డెరోన్ తప్పుబట్టారు.

ప్రజల, వాణిజ్య శ్రేయస్సును కోరుకునేవారు సరిహద్దును మూసివేయడంపై మాట్లాడటం వారి ఓటమికి ప్రధమ కారణం అవుతుందన్న కాల్దెరోన్... అటువంటి విధానాలను ప్రవేశపెట్టడం అమెరికా శ్రేయస్సుకు ఎంతమాత్రం సరికాదన్నారు. అలాగే ఇమ్మిగ్రేషన్ పై ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అసంబద్ధమని, మెక్సికో నుంచి అక్రమ వలసలు సమస్యలను తెచ్చి పెడతాయని అన్నారు. గత నవంబరులో చేపట్టిన ఓ నివేదిక ప్రకారం మెక్సికోకు ఇమ్మిగ్రేట్ అయ్యేవారికంటే  ఆమెరికా నుంచి వలసలు ఎక్కువయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సరిహద్దు గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాల్దెరోన్  తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు