కుప్పకూలిన డైమండ్‌ విమానం : నలుగురు మృతి

17 May, 2019 12:05 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

అమెరికా టెక్‌ దిగ్గజం హనీవెల్‌కు చెందిన  డైమండ్‌  ఎయిర్‌ క్రాష్ట్‌ఖు చెందిన  విమానం కుప్పకూలింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో  నలుగురు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉన్న ఈ బుల్లి విమానం దుబాయ్‌లో కూలిపోయింది.  గురువారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్‌, కో పైలట్‌  సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు.  ఈ  దుర్ఘటన కారణంగా దుబాయ్‌ విమానాశ్రయంలో   కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.  పలు విమానాలు ఆలస్యమైనాయి.  

ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందనీ, ముందు జాగ్రత్త చర్యగా కొన్ని విమానాలను దారి మళ్లించామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దుబాయ్లోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీగల విమానాశ్రయాల్లో  ఒకటిగా పేరుగాంచింది.

దుబాయ్‌లో ఫ్లైట్ కాలిబ్రేషన్ సర్వీసెస్ నిమిత్తం డీఏ42 విమానాన్ని అద్దెకు తీసుకున్నామని హనీ వెల్‌ తెలిపింది. ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన సంస్థ బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని  ప్రకటించింది.

మరిన్ని వార్తలు