విద్యార్ధులకు ఫ్రాన్స్‌ బంపర్‌ ఆఫర్‌

22 Jul, 2020 20:04 IST|Sakshi

పారిస్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు వీసాల మంజూరులో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఫ్రాన్స్‌ మాత్రం దేశీయ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కరోనా ఉదృతి తగ్గిన వెంటనే దేశీయ విద్యార్థులకు వీసాల మంజురు ప్రక్రియ ప్రారంభిస్తామని ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుల్‌  లెనైన్‌ బుధవారం తెలిపారు. వీసాల మంజూరుపై వెబినార్‌లో జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఫ్రాన్స్‌ అధికారులు స్పందిస్తు, వీసాల మంజూరు త్వరలోనే వేగవంతం చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, కరోనా వ్యాప్తికి ముందు 10,000 మంది దేశీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో విద్యను అభ్యసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేనందున దేశీయ విద్యార్థులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలని అధికారులు సూచించారు. అయితే ఫ్రాన్స్‌ భాషను దేశీయ విద్యార్థులు నేర్చుకున్నారని లెనైన్ కొనియాడారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఫ్రాన్స్‌ కళాశాలలో 6,000లెక్చరర్లతో ఫ్రాన్స్‌ భాషను విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో దేశీయ విద్యార్థులు ఫ్రెంచ్‌ భాషను అభ్యసిస్తుండడం హర్షణీయమని, ఇరు దేశాల చారిత్రక అవగాహనకు ఇదే నిదర్శనమని ఫ్రెంచ్‌ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: అతడిని హతమార్చాం.. గొప్ప విజయమిది: ఫ్రాన్స్)‌

మరిన్ని వార్తలు