జీవితాంతం ఫుడ్‌ ఫ్రీ..

29 Jul, 2018 01:12 IST|Sakshi

విమానంలో పాప పుట్టింది.. ఆ పాపకు జీవితాంతం మా విమానంలో ప్రయాణం ఫ్రీ.. ఇలాంటి వార్తలు అప్పుడప్పుడూ మనం ఎప్పుడో ఓసారి చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి సంఘటనే ఇటీవల అమెరికాలో జరిగింది. అదేంటంటే ఓ హోటల్‌లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫాలన్‌ గ్రిఫిన్‌ నిండు గర్భిణి. భర్తతో కలసి తన స్నేహితురాలి పిల్లలను ఇంటి వద్ద వదిలివచ్చేందుకు వెళుతున్నారు.

టెక్సాస్‌లోని శాన్‌ఆంటోనియోలో ఉన్న ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ ముందుకు రాగానే ఆమెకు తీవ్రంగా నొప్పులు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఆ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ స్టోర్‌ డైరెక్టర్‌ ఎన్‌రిక్‌ వచ్చి సాయం చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఫాలన్‌. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఎన్‌రిక్‌ చెప్పింది. ఆ పాపకు జీవితాంతం వారి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో ఫుడ్‌ ఫ్రీగా ఇస్తామని, ఆ పాపకు 14 ఏళ్లు రాగానే ఏదైనా ఉద్యోగం కూడా ఇస్తామని యాజమాన్యం సంతోషంగా ప్రకటించింది.

మరిన్ని వార్తలు