ఫ్రాన్స్ బామ్మగారా.. మజాకా!

30 Oct, 2016 06:22 IST|Sakshi
ఫ్రాన్స్ బామ్మగారా.. మజాకా!

సాధారణంగా అరవై ఏళ్ల తర్వాత వయసురీత్యా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కానీ 82ఏళ్ల బామ్మగారు ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించడమే కాదు తాను ప్రయాణిస్తున్న రైళ్లోని ప్రయాణికులకు ఆనందాన్ని పంచారు. ఆ బామ్మ పేరేంటో తెలియదు కానీ ఆమె చేసిన విన్యాసాలు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎంతో మంది యువకులు, నడివయస్కులు ఉన్నా.. వారి ముందు ఫీట్లు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడుతున్నట్లు కనిపించలేదు. ఫ్రాన్స్ బామ్మ రైళ్లో హుషారుగా సినిమా తరహాలో కొన్ని ఫీట్లను చేశారు.

ఆమె చేసిన కొన్ని విన్యాసాలు వీడియోలో చూడవచ్చు. సాధారణంగా మూవీలలో హీరోయిన్లు చేసే ఓ స్టంట్ చేసి ఔరా అనిపించారు. ఆమె ఎదురుగా కొంతమంది చేతులు పైకెత్తి నిలుచుండగా, బామ్మగారు వారి చేతులపైకి జంప్ చేసి చేతులపై నుంచి పాకుతూ అలాగే ముందుకెళ్లి కిందకి దిగారు. ఆ తర్వాత తలపై భారం మోపుతూ మరో ఫీట్ చేశారు. కాళ్లనొప్పులు, కీళ్లనొప్పులు, ఇతరత్రా సమస్యలు తనకేం లేవని చెప్పిన బామ్మ.. నేలపై తల ఉంచి శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ కాసేపు కాళ్లను నిటారుగా ఉంచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఆ ఫీట్లు చేస్తున్నంతసేపూ అక్కడున్న వారు 'మెర్సీ మామి' అంటూ ఎంకరేజ్ చేశారు.

మరిన్ని వార్తలు