జీవరసాయన ఆయుధాల దాడి జరగొచ్చు!

19 Nov, 2015 15:55 IST|Sakshi

పారిస్: కరుడుగట్టిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జీవరసాయన ఆయుధాలతో దాడికి పాల్పడే అవకాశం ఉందని గురువారం ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయల్ వాల్స్ అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్లో జరిగిన భయంకర ఉగ్రవాద దాడుల నేపథ్యంలో గురువారం ఫ్రెంచ్ పార్లమెంట్ దిగువ సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'ఉగ్రవాదుల నుండి జీవరసాయన దాడులు జరిగే అవకాశం ఉంది. రసాయనాలు లేదా బాక్టీరియాతో ఉగ్రవాదులు ఫ్రాన్స్పై దాడి జరపొచ్చు. ఇలాంటి దాడుల నుండి బయటపడటానికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మనం ఏ విషయాన్ని తోసిపుచ్చలేం' అన్నారు.

దాడుల నేపథ్యంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని పొడగించడానికి పార్లమెంట్ అనుమతి కోరారు. భయంకరమైన దాడులకు ఊహించలేనన్ని అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారని మాన్యుయల్ వాల్స్ తెలిపారు. ఈ విషయాలను మనసులో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

మరిన్ని వార్తలు