జ్యూస్.. ఫ్రెష్ జ్యూస్..

1 Dec, 2014 03:25 IST|Sakshi
జ్యూస్.. ఫ్రెష్ జ్యూస్..

జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే. చిత్రంలోని జ్యూస్ మరీ మంచిదట. ఆస్తమా, రక్తహీనత పోవడంతోపాటు ఎముకలు దృఢమవుతాయట. మెదడుకూ ఎంతో మంచిదట. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, లైంగిక సామర్థ్యం తగ్గినవారు ఈ జ్యూస్ తాగితే ఇక ఆ సమస్యలు దరిచేరవట. ఇంకా చాలాచాలా సుగుణాలు ఉన్నాయట. పెరూ, బొలీవియాకు వెళ్తే.. అక్కడివాళ్లు ఈ జ్యూస్ గొప్పతనం గురించి ఇంకా చాలా చెబుతారు. ఇంతకీ ఈ జ్యూస్‌ను దేంతో తయారుచేస్తారో చెప్పలేదు కదూ.. అయితే.. రాసుకోండి..
 
తయారీ విధానం..
మొదటగా కొన్ని క్యారెట్లు తీసుకోండి.. తర్వాత కప్పుడు తేనె.. రెండింటినీ మిక్సీలో వేయండి..
 
బాగా ముద్దలా మారిన తర్వాత వెనీలా ఎసెన్స్ వేయండి. మళ్లీ మిక్సీ చేయండి.
 
ఇప్పుడిక అసలు పని మొదలవుతుంది. చేతులు క్లీన్ చేసుకుని.. టిటికాకా నీటి కప్పలను తీసుకోండి. మీరు విన్నది నిజమే. కప్పలనే. ఎందుకంటే ఈ జ్యూస్‌ను అరుదైన టిటికాకా  కప్పలతోనే తయారుచేస్తారు.. ఆశ్చర్యపోకుండా ముందు రాసుకోండి.. అవి చచ్చిన తర్వాత చర్మం వలిచి.. క్లీన్ చేసి.. మిక్సీలో బాగా రుబ్బండి. మధ్యలో కొన్ని ఐసు ముక్కలు వేయండి. ఇక జ్యూస్ రెడీ. అతిథులకు చల్లగా అందించండి.
 
గమనిక: స్థానికులు సర్వరోగనివారిణి అని ఈ కప్పల జ్యూస్‌ను తెగ తాగేస్తున్నా.. పై రోగాలను ఇది తగ్గిస్తుందనడానికి ఏ ఆధారమూ లేదని వైద్యులు అంటున్నారు.

>
మరిన్ని వార్తలు