ఇంటర్నెట్ స్టార్ గా రెండు నెల్ల చిన్నారి!

28 Mar, 2016 20:32 IST|Sakshi
ఇంటర్నెట్ స్టార్ గా రెండు నెల్ల చిన్నారి!

శాన్ ఫ్రాన్సిస్కోః ఆ అమెరికా బుజ్జాయి ఇప్పుడు ఇంటర్నెట్ స్టార్ అయిపోయింది. మెత్తని పట్టు కుచ్చులాంటి నల్లని కురులతో అభిమానుల మనసు దోచేస్తోంది. తల్లిదండ్రులిద్దరూ కూతురుతో తీసుకున్న సెల్ఫీ.. సోషల్ మీడియాలో పోస్టు చేసిన నాలుగు రోజులకే యూజర్లను అమితంగా ఆకట్టుకుంది. రెండు నెలల పాపను చూసి  ముగ్ధులైన బంధువులు, స్నేహితులు ఆమె చిత్రాన్ని ఇతర మాధ్యమాల్లో షేర్ చేయడంతో లక్షలమంది అభిమానాన్ని చూరగొంటోంది.  

శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన డేవ్.. మెకెంజీ కెప్లాన్ ల ముద్దుల కూతురు ఇసాబెల్లె. అమాయకంగా కనిపించే తమ ముద్దుల పాపతో తీసుకున్న సెల్ఫీ గత శుక్రవారం మెకెంజీ కెప్లాన్.. సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. అసాధారణమైన, ఒత్తైన కురులతో కనిపిస్తున్న చిన్నారి ఇసా..చిత్రాన్ని చూసి ముగ్ధులైన స్నేహితులు, బంధువులు మరుసటిరోజు ఇతర సైట్లకు సైతం షేర్ చేయడంతో ఇప్పుడా ఫొటో ఇంటర్నెట్ లో వైరల్ లా వ్యాపించింది. ఓరెగాన్ లో నివసించే ఇసాబెల్లె కజిన్..  'మై బేబీ కజిన్' టైటిల్ తో సామాజిక నెట్వర్కింగ్ సైట్ రెడ్డిట్ లో షేర్ చేయడంతోపాటు.. నా చెల్లి జుట్టు చూస్తే అంకోర్మాన్యాన్లోలా ఉంది అంటూ  షేర్ సేసిన కొద్ది గంటల్లోనే రెడ్డిట్ హోం పేజీలో పాపులర్ అయిపోయింది. ఫొటోషాప్ లో చిత్రాలకు  మార్పులు, చేర్పులు చేసి, వాటికి ఇతర వినియోగదారులను ఓట్లు వేయమంటూ అడిగే  సబ్ రెడ్డిట్ లో కూడ ఈ  అందాల బొమ్మ చేరిపోయింది. ఇంకేముందీ ఇసాబెల్లే చిత్రానికి వినియోగదారులు వందలకొద్దీ ఓట్లు కురిపించారు. అమెను ఓ స్టార్ గా మార్చేశారు.

పసిడి కాంతుల పాపాయిని అభిమానులు మారియో లోపెజ్ తో పోల్చారు. జన్యుపరమైన కారణాలవల్లే ఇటువంటి ఒత్తైన జుట్టు వచ్చే అవకాశం ఉందని శిశు వైద్యురాలు.. డేవ్ పక్లన్ షు తెలిపారు. వంశ పారంపర్యంగా కూడ ఇటువంటి కురులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. దీంతో కెప్లాన్  తమ కుమార్తె  అందమైన కురులకు తానే కారణమంటూ మురిసిపోతోంది. పైగా మూడు నెలల వయసున్నపుడే తన జుట్టు కళ్ళపై పడేట్టు ఉండేదని తన అమ్మ చెప్పేదంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. తమ బిడ్డ ఎంతోమంది వినియోగదారులకు ఆనందాన్నివ్వడంతో పాటు ఫొటోషాప్ ఇమేజెస్ లో చోటు సంపాదించడం తమకెంతో సంతోషంగా ఉందని ఇసాబెల్లె తల్లిదండ్రులు పొంగిపోతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు