మ్యూజియంలో అలరించనున్న బంగారు టాయిలెట్!

22 Apr, 2016 21:29 IST|Sakshi
మ్యూజియంలో అలరించనున్న బంగారు టాయిలెట్!

న్యూయార్క్ః అమెరికా ప్రజలను 'గోల్డెన్ టాయిలెట్' అలరించనుంది. 18 కారెట్ల బంగారంతో తయారైన టాయిలెట్ సీటుతో అమెరికా మ్యూజియంలోని బాత్ రూం లో త్వరలో కొలువుదీరనుంది. ఆ కళాత్మక రూపం కేవలం సందర్శకుల దర్శనార్థమే కాక, వినియోగించేందుకు కూడ వీలుపడేట్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూయార్క్ లోని గగెన్హీమ్ మ్యూజియంలో మారాజియో కాటలెన్ రూపొందించిన పద్ధెనిమిది క్యారెట్ల  పూర్తి ఫంక్షనల్ గోల్డ్ టాయిలెట్ ను పబ్లిక్ టాయిలెట్ల స్థానంలో స్థాపించనున్నారు. ప్రతి ఒక్కరూ మ్యూజియంలోని టాయిలెట్ ను సందర్శించే అవకాశం ఉందని, దీనికి తోడు తలుపును మూసి మంచి అనుభవాన్ని కూడ పొందే వీలుందని గగెన్హీమ్ ప్రచారకర్త మోలీ స్టీవర్డ్ తెలిపారు. అమెరికాలోని మారాజియో కాటలెన్ మొదటిసారి రూపొందించిన ఈ కళాత్మక టాయిలెట్... మ్యూజియంలో ప్రదర్శనతోపాటు, ప్రజల వినియోగానికి కూడ వీలుగా ఉండేట్లు సృష్టించారని  స్టీవర్ట్ తెలిపారు. ఈ బంగారు టాయిలెట్ కళాకారుడి సృజనాత్మకతను సూచిస్తుందని ఆయన వివరించారు. 2011 లో కళా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన 55 ఏళ్ళ కళాకారుడు కాటలెన్.. ఆసమయంలో కళాప్రపంచ డిమాండ్లకు స్ఫూర్తిదాయకమవ్వడంతో  అతడి పని తీరును గుర్తించి, ప్రోత్సహించిన అమెరికాలోని  గగెన్హీమ్ మ్యూజియం.. అక్కడ  ప్రదర్శనకు ఉంచేందుకు వీలుగా  ప్రత్యేక రూపాన్ని సృష్టించేందుకు అతడిని తిరిగి ప్రోత్సహించినట్లు వెల్లడించారు.

ఆర్థిక అసమానతలను రూపుమాపడమే ఇతివృత్తంగా తాను టాయిలెట్ థీమ్ ను ఎంచుకొన్నానని, అయితే అది సందర్శకుల వినియోగానికి వీలుగా ఉండాలన్న దృష్టితో రూపొందించినట్లు కళాకారుడు కాటలెన్ చెప్తున్నాడు. ప్రజలు నా పనిని గుర్తించాలన్న ఉద్దేశ్యంతో దీన్ని తయారు చేయలేదని, వారి సందర్శనకు, అనుభవాలకు మంచి అవకాశాన్ని కల్పించే కళారూపం కావాలని కాటలెన్ తెలిపాడు. అయితే ఈ విలాసవంతమైన రూపం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే దీన్నిమ్యూజియం లోని యూనిసెక్స్ బాత్రూంలో ఏర్పాటు చేస్తున్నట్లు మ్యూజియం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి కూడ ప్రత్యేకంగా ఓ ఫుల్ టైం సెక్యూరిటీ గార్డును నియమిస్తారని, అతడు రెస్ట్ రూం బయట నిలబడి ఉంటాడని,  ప్రజలు ఎటువంటి దశ్చర్యలకు పాల్పడకుండా అప్పుడప్పుడు లోపల చెక్ చేస్తుంటాడని ప్రచారకర్త మోలీ  స్టీవర్ట్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక టాయిలెట్ ను సందర్శించి మంచి అనుభవాన్ని పొందేందుకు సహకరించాలే తప్ప.. ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని సూచించారు. దీర్ఘకాల ప్రయోజనం కోసమే అమెరికా ఈ టాయిలెట్ ను మ్యూజియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు