బరువు తగ్గటానికి బెలూనే బెటర్!

26 May, 2016 14:24 IST|Sakshi
బరువు తగ్గటానికి బెలూనే బెటర్!

వాషింగ్టన్: ఒబెసిటీ.. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయత్వంతో బాధపడే వారి సంఖ్య 640 మిలియన్లుగా పైగా ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరి వెయిట్ లాస్ కోసం స్థూలకాయులు చేస్తున్న సాధారణ ప్రయత్నాలు ఫలిస్తున్నాయా అంటే తక్కువనే చెప్పాలి.

అహారం తక్కువగా తీసుకోవటం, ఎక్సర్సైజులు చేయటం లాంటి చిన్నచిన్న మార్పులతో టోటల్ బాడీ వెయిట్లో కలిగే వెయిట్ లాస్ సరాసరి 3.59 శాతంగానే ఉందట. అయితే, పొట్టలో గ్యాస్తో నింపబడిన ఒబలాన్ బెలూన్ వాడుతున్న స్థూలకాయుల్లో మాత్రం ఈ యావరేజ్ వెయిట్ లాస్ 6.81 శాతంగా ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అహార నియమాలు పాటించడం, ఎక్సర్సైజ్లు లాంటి ప్రయత్నాలతో బాడీ వెయిట్ను తగ్గించుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి బెలూన్ ట్రీట్మెంట్ చక్కని పరిష్కారం అని పరిశోధనకు నేతృత్వం వహించిన షల్బీ సల్లీవాన్ తెలిపారు.

 

మరిన్ని వార్తలు