మలేరియా దోమలు ఇక మటాష్‌!

3 Jun, 2019 12:00 IST|Sakshi

సిడ్నీ: మలేరియాను అదుపు చేయడంలో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలో కనిపించే ఓ రకం సాలీడులో ఉండే విషంలోని జన్యువులతో అభివృద్ధి చేసిన ఫంగస్‌ను మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఎనాఫిలిస్‌ దోమల సంహారంలో వినియోగించి మంచి ఫలితాలు సాధించారు. మలేరియాను వ్యాప్తిచేసే ఆడ ఎనాఫిలిస్‌ దోమలకు హాని కలిగించే ‘మెటరీజియమ్‌ పింగ్షీన్స్‌’ అనే ఫంగస్‌ను శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. 

6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కృత్రిమంగా ఓ ప్రాంతాన్ని సృష్టించి, అక్కడ ఈ ఫంగస్‌ పెరిగే ఏర్పాట్లు చేశారు. జన్యుపరంగా మార్పులు చేసిన ఈ ఫంగస్‌ చాలావేగంగా దోమల ప్రాణాలను హరించింది. కేవలం 45 రోజుల్లోనే అక్కడి 99 శాతం దోమలను నిర్మూలించగలిగారు.  

మరిన్ని వార్తలు