ప్రపంచ రికార్డుకు బరువైన సైకిల్..!

10 Sep, 2016 11:04 IST|Sakshi
ప్రపంచ రికార్డుకు బరువైన సైకిల్..!

ద్విచక్ర వాహనాల్లో అతితక్కువ బరువుండేది సైకిలే అని చెప్సాలి. అయితే ఇప్పుడు కొత్తగా రూపొందిన సైకిల్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మిగిలిన ద్విచక్ర వాహనాలే కాక, కార్లకంటే కూడా బరువుగా ఉండే సైకిల్ ను జర్మనీకి చెందిన ఓ సైకిల్ అభిమాని రూపొందించాడు. వందలకొద్దీ బరువున్న  ప్రపంచంలోనే అత్యంత బరువైన ఆ సైకిల్ ఇప్పుడు రికార్డులకు ఎక్కేందుకు సిద్ధంగా ఉంది.

జర్మనీ స్లెస్వింగ్ హోల్ స్టెన్ కు చెందిన 49 ఏళ్ళ ఫ్రాంక్ డోస్.. భారీ వాహనాల టైర్లు, పాత ఇనుప సామాన్లతో అత్యంత బరువైన సైకిల్ ను రూపొందించాడు. ఈ జంబో సైకిల్ 1.53 మీటర్ల వ్యాసం, 940 కిలోల బరువు కలిగి ఉంది. ఈ  సైకిల్ ను 1200 కేజీల మరింత బరువుగా రూపొందించే పనిలో కూడా ఉన్నట్లు డోస్ చెప్తున్నాడు. అయితే అంతటి బరువున్న ఆ సైకిల్ ను సాధారణ సైకిల్ తొక్కినట్లుగానే సునాయాసంగా తొక్కొచ్చని డోస్ చెప్తున్నాడు. ఈ భారీ సైకిల్ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఈ సైకిల్ ప్రయాణిస్తుంది.

రెండేళ్ళు కష్టపడి దాదాపు 5000 డాలర్లు ఖర్చు చేసి డోస్... ప్రపంచంలోకెల్లా అత్యంత బరువైన సైకిల్ ను రూపొందించాడు. ఇటీవల 100 మీటర్ల దూరం తొక్కి  చూపించిన డోస్.. గిన్నిస్ రికార్డుకోసం ప్రయత్నిస్తున్నాడు. గతంలో బెల్జియం కు చెందిన జెఫ్ పీటర్స్ తయారు చేసిన 860 కిలోల బరువైన సైకిల్  గిన్నిస్ రికార్డు పొందగా... అంతకు మించిన 940 కిలోల బరువుతో డోస్ తయారు చేసిన  సైకిల్.. ఇప్పుడు ప్రపంచ రికార్డును సాధించనుంది.

మరిన్ని వార్తలు