వెరైటీ ప్రపోజల్‌: వెంటనే పెళ్లి కూడా ఖరారు

13 Feb, 2020 19:46 IST|Sakshi

బెర్లిన్‌: ప్రేమికుల వారోత్సవం ముగింపు ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటిదాకా ఒకెత్తు, రేపటి దినం మరో ఎత్తు. ఎన్ని ఇచ్చి పుచ్చుకున్నా, ఒకరి దగ్గర మరొకరు ఎంత గారాలు పోయినా రేపు అసలు పరీక్ష. ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే. కాబట్టి ఆ ఒక్కరోజు ప్రేమించేవారి మనసు గెలిచామంటే చాలు.. జీవితాంతం వారితోనే బతికేస్తామంటూ ఊహల్లో బతికేస్తారు చాలామంది. కొందరు ఊహలు నిజమైతే మరికొందరివి మాత్రం పగటి కలల్లాగే మిగిలిపోతాయనుకోండి.. అది వేరే విషయం. అయితే ప్రేమను వ్యక్తపరిచే కళ అందరికీ ఉండదు. ఎన్నెన్నో అనుకున్నా ఎదురుగా ప్రేయసి/ ప్రేమికుడు తారసపడేసరికి మాత్రం నోరు మూగబోతుంది. అందుకే కొందరు నేరుగా కాకుండా మెసేజ్‌లోనో, కాల్‌ చేసో, ఉత్తరం రాసో, ఫ్రెండ్‌ ద్వారానో ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ మనసులోని మాటను ఇష్టసఖికి చేరవేస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం తను ప్రేమించిన అమ్మాయికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రపోజ్‌ చేసి వార్తల్లో నిలిచాడు.(ప్రేమకు అసలైన నిర్వచనం ప్రేమలేఖలే)

జర్మన్‌కు చెందిన స్టీఫెన్‌ స్క్వార్జ్‌ తన ప్రేమను గెలిపించుకోడానికి పొలాన్నిమార్గంగా ఎంచుకున్నాడు. పొలంలో మొక్కజొన్న పంటను యంత్రసహాయంతో ఒక క్రమపద్ధతిలో నాటాడు. అది ఏరియల్‌ వ్యూ ద్వారా చూస్తే ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని జెర్మన్‌ భాషలో కనిపిస్తుంది. ఇది అక్కడి జనాలను ఎంతగానో అబ్బుపరిచింది. ఈ ప్రపోజల్‌ సరాసరి గూగుల్‌ మ్యాప్‌లో ప్రత్యక్షం కావడమే ఈ ఆశ్యర్యానుభూతులకు ప్రధాన కారణం. ఇక అనతికాలంలోనే ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతమందికి నచ్చాక ప్రేయసి పడిపోకుండా ఉంటుందా.. ఈ స్పెషల్ ప్రపోజల్‌తో అతని ఒళ్లో వాలిపోవడమే కాదు.. ఏకంగా జూన్‌లో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసేసుకున్నారీ జంట. (కోటి మాటలు ఓ కౌగిలింతకు సరికావు!)

చదవండి: గర్భిణీకి కరోనా, మరి శిశువుకు?

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా