రేప్ చేసిన వారి గురించి అబద్ధం చెప్పింది!

6 Jul, 2016 12:42 IST|Sakshi
రేప్ చేసిన వారి గురించి అబద్ధం చెప్పింది!

మ్యాన్హైమ్: వలస బాధితుల కోసం పోరాటం చేస్తున్న జర్మనీ యువ రాజకీయవేత్త సెలిన్ గోరెన్(25).. గత జనవరిలో వలసదారుల చేతిలోనే అత్యాచారానికి గురైంది. అర్థరాత్రి సమయంలో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లిన దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు. అయితే, ఆ వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లిన సెలిన్.. తనపై అత్యాచారం జరిపిన వారి వివరాలను తప్పుగా వెల్లడించిందట.

ఆ సమయంలో పోలీసులతో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల పోలికలు, భాష తదితర వివరాలను తప్పుగా చెప్పినట్లు ఆమె తాజాగా అంగీకరించింది. అయితే.. అప్పటికే కొలోన్లో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారాల నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వలసదారులను దృష్టిలో ఉంచుకొనే ఆమె పోలీసులకు అసత్యం చెప్పినట్లు వెల్లడించింది. వాస్తవానికి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులు అరబిక్, పార్సీ భాషను మాట్లాడినట్లు గుర్తించిన సెలిన్.. పోలీసులకు మాత్రం వారు జర్మన్ మాట్లాడినట్లు వెల్లడించింది. జాతివివక్షతతో కూడిన వ్యతిరేకతను దూరం చేయడానికే ఆ సమయంలో అలా అబద్ధం చెప్పినట్లు సెలిన్ వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు