మానవాళి శ్రేయస్సుకు.. జర్మనీ కొత్త పద్దతి

18 Jan, 2018 17:59 IST|Sakshi

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : ప్రపంచంలో వాతావరణం మార్పు పెద్ద తలనొప్పిగా మారింది. ప్లాస్టిక్‌ వినియోగం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులకు సంభవిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు జర్మనీ దేశంలోని ఫ్రీబర్గ్‌ కంపెనీ ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. మనం రోజుకు అనేక సార్లు ప్లాస్టిక్‌ను వాడతాము. కూల్‌డ్రింక్స్‌, కాఫీ, టీ తదితర పానీయాలను తాగడానికి ప్లాస్టిక్‌, పేపర్‌ డిస్పోజబుల్‌ కప్స్‌ను వాడతారు. ఇవి విచ్ఛిన్నం చెంది భూమిలో కలసిపోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. తద్వార భూమి కాలుష్యం అవుతుంది.

అయితే, ఇందుకు ప్రత్యామ్నాయ పద్దతిని జర్మన్‌ కంపెనీ కనుగొంది. ఒకసారికే వాడి పడేయకుండా 400 సార్లు వినియోగించేలా ఓ ప్రత్యేక కప్పును తయారు చేసింది. ఈ కప్పులను నగరంలోని అన్ని చోట్లా ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా వంద కంపెనీలతో ఓ విధానాన్ని జర్మనీ ప్రభుత్వం రూపొందించనుంది. ఒకరి ఒకసారి వినియోగించిన కప్పు వేరొకరికి వెళ్లకుండా ఉండేందుకు కప్పులపై ప్రత్యేకమైన బార్‌ కోడ్‌ను తీసుకొచ్చారు.

జర్మనీలో గంటకు దాదాపు 3 లక్షల కాఫీ కప్పులను వినియోగిస్తారట. సంవత్సరానికి దాదాపు 2.8 బిలియన్‌ కప్పులను వాడతారు. ప్రతీ కప్పును దాదాపు 13నిమిషాల పాటు వినియోగిస్తారు. ఈ సమస్య కేవలం జర్మనీది మాత్రమే కాదు. అమెరికా 2010లో 23 బిలియన్ల పేపర్‌ కప్పులను వాడినట్టు ఓ అంచనా. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 25 బిలియన్ల స్టైరోఫోం కాఫీ కప్పులను, ప్రతి గంటకు 2.5 మిలియన్ల కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌ను వాడి పడేస్తారనీ ఒక అంచనా. ఇవి భూమిలో డీకంపోజ్‌ కావడానికి దాదాపు 500 సంవత్సరాలు పడతాయి.

మరిన్ని వార్తలు