ఐరాస భద్రతా మండలికి ఎన్నిక

9 Jun, 2018 03:09 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశాల కోటాలో బెల్జియం, డొమినికన్‌ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా ఎన్నికయ్యాయి. ఇందుకోసం జరిగిన ఎన్నికలో జర్మనీ, డొమినికన్‌ రిపబ్లిక్‌లకు 184 చొప్పున, దక్షిణాఫ్రికాకు 183, బెల్జియం 181, ఇండోనేసియాకు 144 ఓట్లు పడ్డాయి. మొత్తం 193 సభ్య దేశాలకు గాను 3 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. భద్రతా మండలిలో 15 మంది సభ్యులుంటారు. ఇందులో శాశ్వత సభ్య దేశాలు బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికాతోపాటు తాత్కాలిక జాబితా నుంచి పది దేశాలకు చోటు ఉంటుంది.

మరిన్ని వార్తలు