రాక్షస కోడి...

28 Jul, 2017 03:55 IST|Sakshi
రాక్షస కోడి...
రాక్షస బల్లుల సిరీస్‌లో ఇది కొత్తది. చూడ్డానికి 10 అడుగుల పొడవున్న టర్కీ కోడిలా కనిపిస్తున్న దీని పేరు కారీథొరాప్టర్‌ జాకొబ్సీ.. ఆ మధ్య దీని తాలూకు అస్థిపంజరం దక్షిణ చైనాలో దొరికింది.

అస్థిపంజరాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇది 10 కోట్ల ఏళ్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఉండేదని తేల్చారు. మాంసాహారే.. బరువు 230 కిలోలు. నెత్తి మీద చిన్నసైజు పింఛం దీనికి అదనపు ఆకర్షణట. కోపం వస్తే.. తన కాళ్లతో కరాటే కిక్‌లాంటిది ఒకటిచ్చుకుంటుందట.
మరిన్ని వార్తలు