కరోనా నివారణలో ముందంజ

30 Apr, 2020 05:39 IST|Sakshi

ప్రభావవంతంగా అమెరికా ఔషధం  

వాషింగ్టన్‌: గిలీడ్‌ సైన్సెస్‌ బయోటెక్‌ కంపెనీ అభివృద్ధి చేసిన రెమ్‌డెసివిర్‌ ఔషధానికి కరోనా వైరస్‌ బాధితులకు స్వస్థత చేకూర్చే లక్షణాలు ఉన్నాయని అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌)నిర్వహించిన పరిశోధనలో తేలింది. కరోనా నివారణ కోసం రోగులపై జరిపిన పరీక్షల్లో ఈ ఔషధం ప్రభావవంతంగా పనిచేసినట్లు సమాచారం. ఈ పరీక్షలో ముందంజలో నిలిచిన తొలి ఔషధం రెమ్‌డెసివిర్‌. అయితే, ఈ పరిశోధన పూర్తి వివరాలను ఎన్‌ఐహెచ్‌ బహిర్గతం చేయలేదు. ఎబోలా వైరస్‌ చికిత్సలో ప్రస్తుతం రెమ్‌డెసివిర్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఒక ఇంజెక్షన్‌ ధర రూ.76 పలుకుతోంది. ప్రభుత్వాలు సాయం చేస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి ఇంకా చౌకగా లభ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు