అయ్యో..! ఈ అమ్మాయికి ఎంత కష్టం

3 Jan, 2017 19:07 IST|Sakshi
అయ్యో..! ఈ అమ్మాయికి ఎంత కష్టం

బీజింగ్‌: చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఘటన ఇది. అక్కడి మొజియాంగ్‌ కౌంటీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పాఠశాలలో చదువుతున్న ఓ పదమూడేళ్ల బాలిక తల గ్లాస్‌ డోర్ల మధ్యలో ఇలా చిక్కుకుపోయింది.

స్కూల్‌ క్యాంటీన్‌లో ఆడుకుంటున్న సమయంలో కొందరు మిత్రులు ఆ బాలిక తలను ఇలా గ్లాస్‌ డోర్ల మధ్యలో ఉంచారు. అయితే.. డోర్ల మధ్యలో ఇరుక్కుపోయిన ఆ బాలిక తల సులభంగా బయటకు రాలేదు. బాలికను రక్షించడానికి ఫైర్‌ సిబ్బంది రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. వారు డోర్‌ హ్యండిల్స్‌ను తొలగించడంతో ఆ బాలికను రక్షించారు. సిబ్బంది అక్కడకు చేరుకొని రక్షించేవరకు కొన్ని గంటలపాటు ఆ బాలిక ఇలా నుంచోనే ఉంది. ఈ ఘటనలో ఆ బాలిక మెడకు స్వల్పంగా గాయాలయ్యాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని.. ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదని వారు వెల్లడించారు.

మరిన్ని వార్తలు