తొమ్మిదేళ్లకే చూపు కోల్పోనున్న చిన్నారి

18 Jun, 2019 14:29 IST|Sakshi

బీజింగ్‌: స్మార్ట్‌ఫోన్‌ వల్ల ఎన్ని అనార్థాలు ఉన్నాయో మరోసారి రుజువైంది. ఫోన్‌ను అతిగా వాడడం వల్ల ఓ చిన్నారి చూపు కోల్పోనుంది. చైనాలోని జియాంగ్జూ ప్రాంతానికి చెందిన జియావో అనే రెండేళ్ల బాలికకు కొద్ది రోజులుగా కళ్లు సరిగా కనిపించడంలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చిన్నారికి హ్రస్వదృష్టి ఏర్పడినట్లు తేల్చారు. చిన్నారి ఎదిగేకొద్ది ఈ సమస్య తీవ్రమై, 9 ఏళ్లు వచ్చేసరికి చూపు పూర్తిగా మసకబారిపోయే ప్రమాదముందని చెప్పారు. ఈ సమస్య తలెత్తడానికి కారణమేంటా? అని అన్వేషించగా.. జియావోకు ఏడాది వయసు నుంచే స్మార్ట్‌ ఫోన్‌లో గేమ్స్‌ ఆడుకోవడం అలవాటని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆమె చూపు కోల్పోవడానికి కారణం స్మార్ట్‌ఫోనేనని వైద్యులు తేల్చారు. 


 

మరిన్ని వార్తలు