పెళ్లి చేసుకోకపోతే ముక్కు కోసేసిన దుండగులు

22 Mar, 2014 15:25 IST|Sakshi
పెళ్లి చేసుకోకపోతే ముక్కు కోసేసిన దుండగులు



పెళ్లి చేసుకోను అన్న పాపానికి పాకిస్తాన్ లో ఒక యువతి ముక్కు కోసేశారు కొందరు మూర్ఖులు. ఆమెను క్రూరంగా హింసించి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పాకిస్తాన్ లోని పంజాబ్ లోని బస్తీ షేర్ వాలీలో జరిగింది.
ఇరవై ఏళ్ల ఫరీదా బీబీ తండ్రి బస్తీ షేర్వాలీ భూస్వామి జంషీద్ ఇంట్లో కూలీగా పనిచేస్తూంటాడు. ఆయన కుమారుడు నదీమ్ ఫరీదాపై మనసుపడ్డాడు. అయితే అతడిని వివాహం చేసుకునేందుకు ఫరీదా నిరాకరించింది.
దీంతో భగ్గుమన్న నదీమ్ తన మిత్రులతో కలిసి ఆమెను అపహరించుకువెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత ఆమె మరెవరినీ వివాహం చేసుకోకుండా ఉండాలని ముక్కు కోసేశాడు.
పంజాబ్ హైకోర్టు ఈ కేసును స్వీకరించిన తరువాత కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు.

మరిన్ని వార్తలు