30 లక్షలకు చేరువైన పాజిటివ్‌ కేసులు

27 Apr, 2020 15:57 IST|Sakshi

న్యూయార్క్‌ : రోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. వైరస్‌ పాజిటివ్‌ కేసులు 30 లక్షలకు చేరువకాగా 2 లక్షల 7వేల మంది మహమ్మారితో మృత్యువాతన పడ్డారు. కోవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 8.6 లక్షలకు పెరిగింది. ఇక అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 55,417కు చేరగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9.8 లక్షలకు ఎగబాకింది. బ్రిటన్‌లో ప్రాణాంతక వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 20,000 దాటింది.

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చికిత్స అనంతరం కోలుకుని మూడు వారాలు ఐసోలేషన్‌లో గడిపిన అనంతరం సోమవారం విధులకు హాజరయ్యారు. మరోవైపు భారత్‌లోనూ కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 27,892కు చేరగా మరణించిన వారిసంఖ్య 872కి పెరిగింది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి హాట్‌స్పాట్స్‌లో మే 3 తర్వాతా లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

చదవండి : ఇక ఎప్పటికీ ఇంటి నుంచి పనిచేసే హక్కు!

మరిన్ని వార్తలు