జీ మెయిల్‌: స్పామ్‌ మెసేజ్‌‌ రాకుండా ఉండాలంటే..

6 Jul, 2020 18:01 IST|Sakshi

జీ మెయిల్‌ గురించి తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నెటిజన్లు  జీ మెయిల్‌ వినియోగదారులే. అయితే ఇప్పుడు  జీ మెయిల్‌లో ఓ సమస్య అందరికి తలనొప్పిగా మారింది. అదే స్పామ్‌. మన ప్రమేయం లేకుండానే మన అకౌంట్‌లోకి కుప్పులు తెప్పలుగా మెయిల్స్‌ వస్తూనే ఉంటాయి. జీ మెయిల్‌ ఇప్పటికే అనవసర మెయిల్స్‌ను విభజించి వాటిని స్పామ్‌ ఫోల్డర్‌కు పంపుతుంది. అవి 30 రోజుల తర్వాత డిలీట్‌ అవుతాయి. అయితే అన్ని అనవసర మెయిల్స్‌ను స్పామ్‌ ఫోల్డర్‌కు పంపడం సాధ్యం కాదు. కొన్నిసార్లు స్పామ్‌ మెయిల్స్‌ డైరెక్ట్‌ ఇన్‌బాక్స్‌లోకే వచ్చేస్తుంటాయి. గత వారం నుంచి ఈ సమస్య మరింత తీవ్రతరం అవడంతో గూగుల్‌ ఆ సమస్యకు పరిష్కారం కనుగొంది.  వీటిని మనం రాకుండా ఉండేందుకు కొన్ని రకాల టిప్స్‌ ఇక్కడున్నాయి. (జీమెయిల్‌ ద్వారా కూడా వీడియో కాల్స్‌)

1. రిపోర్టు, బ్లాక్‌
.మనకు కొన్ని అకౌంట్‌ల నుంచి ఎక్కువగా స్పామ్‌ మెయిల్స్‌ వస్తుంటాయి. వాటని రిపోర్ట్‌ లేదా బ్లాక్‌ చేయడం ద్వారా మళ్లీ ఆ మెయిల్స్‌ రాకుండా ఉంచవచ్చు. ఇందుకు సంబంధిత మెయిల్‌ను ఓపెన్‌ చేసి కుడి వైపు పైన కనిపించే మూడు చుక్కల బటన్‌ను నొక్కి అక్కడ ఉండే స్పామ్‌ రిపోర్టును నొక్కితే చాలు. అలాగే పంపించిన వారిని బ్లాక్‌ చేసినా సరిపోతుంది. (గూగుల్‌ సెర్చ్‌ హెడ్‌గా ప్రభాకర్‌ రాఘవన్‌)

2. మెసేజ్‌లను ఫిల్టర్‌ చేయడం
మెయిల్‌ను స్పామ్‌గా రిపోర్ట్ చేయకూడదనుకుంటే, లేదా పంపినవారిని బ్లాక్ చేయకపోతే అలాంటి మెసేజ్‌లను ఫిల్టర్ చేయవచ్చు. దీని ద్వారా భవిష్యత్తులో మీ ఇన్‌బాక్స్‌లోకి ఇలాంటి మెసేజ్‌లు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. దీనికి కూడా ముందుగా చెప్పినట్లు కుడి వైపు కనిపించే మూడు చుక్కల బటన్‌ను నొక్కి  ఫిల్టర్‌ మెసేజెస్‌ లైక్‌ దిస్‌ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. కాగా ఫిల్టర్‌ కోసం కొన్ని పదాలు, సైజ్‌, అటాచ్‌మెంట్స్‌ వంటి మరిన్ని వివరాలను కూడా మెయిల్స్‌కు జోడించవచ్చు. ఆ తర్వాత ఈ ఫిల్టర్ చేసిన మెయిల్స్‌ను ఆర్కైవ్ చేయడం, డిలీట్‌ చేయడం , పొటెన్షియల్‌ స్పామ్‌గా లేబుల్ చేయడం చేయవచ్చు.

మరిన్ని వార్తలు