యూజర్లకు గూగుల్ వార్నింగ్!

27 Jan, 2017 17:54 IST|Sakshi
యూజర్లకు గూగుల్ వార్నింగ్!

న్యూఢిల్లీ: మెసెజింగ్ సర్వీస్ జీమెయిల్ యూజర్లకు సెర్చింగ్ దిగ్గజం గూగుల్ కొన్ని సూచనలు చేసింది. వచ్చే ఫిబ్రవరి 13 నుంచి జీమెయిల్ యూజర్లు జావా స్ర్కిప్ట్ ఫైళ్లను రిస్ట్రిక్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. కొన్ని రకాల వైరస్ ల కారణంగా జీమెయిల్ యూజర్లను ఇందుకు సంబంధించిన ఫైళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఫిబ్రవరి 13 తర్వాత నుంచి జావా స్క్రిప్ట్ ఫైళ్లను సెండ్ చేస్తే మెస్సేజ్ ఈజ్ బ్లాక్‌డ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అని డైలాగ్ బాక్స్ వస్తుందని సంస్థ తెలిపింది. యూజర్లకు సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, వైరస్‌ల నుంచి ఇన్‌బాక్స్, సెంట్ మెయిల్స్, ఇతరత్రా డాటాను సెక్యూర్ చేయడానికి ఈ చర్యను తీసుకున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం జీమెయిల్ నుంచి .exe, .msc, and .bat ఫైళ్లను, వీటికి సంబధించిన ఫైల్ అటాచ్‌మెంట్స్‌ను పంపడాన్ని నిషేధిస్తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో .జేఎస్ (జావా స్క్రిప్ట్‌) ఫైళ్లను వేరే యూజర్లను పంపాల్సి వస్తే అందుకు గూగుట్ డ్రైవ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, ఇతర స్టోరేజ్ సౌకర్యం ఉన్న సర్వీసు నుంచి నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చునని గూగుల్ వివరించింది. జీమెయిల్ సర్వీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు