షాకింగ్‌: వీటికి కూడా క‌రోనా సోకింది!

5 May, 2020 09:24 IST|Sakshi

దొడోమ: క‌రోనా వైర‌స్ ఇప్ప‌టివ‌ర‌కు మ‌నుషుల‌కు, పులులు, పిల్లులు వంటి కొన్ని జంతువుల‌కూ వ‌చ్చింది‌. అయితే విచిత్రంగా ఓ మేక‌కు, మ‌రీ విచిత్రంగా ఓ బొప్పాయి పండుకు క‌రోనా సోకింది. ఈ వింత సంఘ‌ట‌న టాంజానియాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే టాంజానియా దేశంలో క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ చేసే ప‌రీక్షా కిట్ల‌ను ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంది. దీన్ని మ‌నుషుల‌తోపాటు బొప్పాయి, మేక, గొర్రెల‌ ‌పైనా ప‌రీక్షించింది‌. ఈ క్ర‌మంలో గొర్రె మిన‌హా మిగ‌తా రెండింటికి వైర‌స్ సోకిన‌ట్లు త‌ప్పుడు ఫ‌లితా‌లివ్వ‌డంతో కిట్ల‌లో డొల్లత‌నం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆ దేశ అధ్య‌క్షుడు జాన్ మ‌గుఫులి దిగుమ‌తి చేసుకున్న టెస్టు కిట్ల‌లో సాంకేతిక లోపాలున్నాయ‌ని వెల్ల‌డించారు. వీటి వాడ‌కాన్ని నిలిపివేస్తూ ద‌ర్యాప్తుకు ఆదేశించారు. (ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కలకలం)

కాగా ఇప్ప‌టికే వైర‌స్ వ్యాప్తి విష‌యాన్ని దాస్తోంద‌ని ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు వ‌చ్చిన‌వేళ నాసిర‌కం కిట్ల‌తో ప్ర‌జ‌ల ఆరోగ్యంపై చెలగాట‌మాడుతున్నార‌ని విప‌క్షాలు మ‌రోసారి భ‌గ్గుమంటున్నాయి. మరోవైపు అధ్య‌క్షుడు జాన్ మ‌గుఫులి మాత్రం ఈ కిట్ల ద్వారా.. కొంత‌మంది క‌రోనా బాధితుల‌కు వైర‌స్ సోక‌లేదన్న విష‌యం నిరూపిత‌మ‌వుతోంద‌న్నారు. ఆదివారం నాటికి టాంజానియాలో 480 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా 17 మంది‌ మ‌ర‌ణించారు. అక్క‌డ ప‌ది ల‌క్ష‌ల మందికి గానూ కేవ‌లం 500 మందికి మాత్ర‌మే ప‌రీక్ష‌లు చేస్తున్నారు. (ఈ ఏడాది చివరికల్లా టీకా!)

మరిన్ని వార్తలు