230 కోట్ల యాడ్స్‌ నిషేధం

14 Mar, 2019 17:20 IST|Sakshi

తప్పుడు ప్రకటనలపై కొరడా ఝుళిపించిన గూగుల్‌ 

2018లో 2.3 బిలియన్ల యాడ్స్‌ బ్యాన్‌

రోజుకు 60లక్షల  యాడ్స్‌ బ్యాన్‌

ఆన్లైన్ యూజర్లకు హానిచేస్తున్న తప్పుడు వ్యాపార ప్రకటనలపై గూగుల్ కొరడా ఝళిపిస్తూ వస్తోంది. ఈక్రమంలో గూగుల్ 2018 లో 2.3 బిలియన్ల  (230 కోట్ల) ప్రకటనలను నిషేధించినట్టు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌ తాజాగా వెల్లడించింది. వినియోగదారులను మిస్‌ లీడ్‌  చేస్తున్న  బ్యాడ్‌ యాడల్‌లను రోజుకు 6లక్షలకు పైగా బ్యాన్‌ చేసినట్టు తెలిపింది.

2018 బ్యాడ్‌యాడ్‌ రిపోర్టులో గూగుల్‌ ఈ వివరాలు అందించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలనుంచి వినియోగదారులను కాపాడి, మెరుగైన సేవలను అందించే లక్ష్యంగా కొత్త విధానాలను తీసుకొచ్చినట్టు తెలిపింది. ప్రధానంగా 31కొత్త విధానాలను ప్రవేశపెట్టామని గూగుల్‌ వెల్లడించింది. తమ సంస్థ ద్వారా ప్రతీ యూజర్‌కు ఆరోగ్యకరమైన  స్థిరమైన ప్రకటనల ఎకోసిస్టంను  అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని సస్టైనబుల్‌ యాడ్స్‌  డైరెక్టర​ స్కాట్ స్పెన్సర్  ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా ఎప్పటికపుడు తన పాలసీని అప్‌డేట్‌ చేస్తూ వస్తున్న గూగుల్‌  వినియోగదారుల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న సుమారు 1.5 మిలియన్ల యాప్‌లను ఇప్పటికే తొలగించింది.  అలాగే దాదాపు 734,000 మంది ప్రచురణకర్తలు, యాడ్‌ డెవలర్స్‌ను తన  ప్రకటన నెట్వర్క్ నుండి రద్దు చేసింది. క్రిప్టోకరెన్సీలను ప్రమోట్‌ చేసే ఆన్‌లైన్‌ ప్రకటనలు, సంబంధిత కంటెంట్ను కూడా నిషేధించింది. 2017లో కూడా వ్యాపార ప్రకటన పాలసీ నిబంధనలు ఉల్లంఘించిన 3.2 బిలియన్ల ప్రకటనలను తొలగించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు