గూగుల్ చేతికి ఫిట్‌బిట్‌

2 Nov, 2019 13:05 IST|Sakshi

2.1 బిలియన్ డాలర్ల డీల్‌

వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా వేరబుల్ టెక్నాలజీ సంస్థ ,   ‍ స్మార్ట్‌వాచ్‌  తయారీ ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 2.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు తమ ఉత్పత్తులను విశ్వసిస్తున్నారని ఈ సందర్భంగా ఫిట్‌బిట్‌ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో జేమ్స్ పార్క్ తెలిపారు.

అత్యుత్తమమైన హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో ఫిట్‌నెస్ బ్యాండ్స్ తదితర వేరబుల్ ఉత్పత్తులను మరింత మెరుగు పర్చేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని గూగుల్ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ (డివైజెస్‌, సర్వీసెస్ విభాగం) రిక్ ఓస్టర్‌లో తెలిపారు. వేరబుల్స్ విభాగంలోకి అందరికన్నా ముందుగా ప్రవేశించినప్పటికీ.. ఇతర సంస్థలతో పోటీ కారణంగా వెనుకబడుతున్న ఫిట్‌బిట్‌కు ఈ డీల్ ప్రయోజనకరంగా ఉండనుంది. మరోవైపు, ఆన్‌లైన్‌ సెర్చిలో గుత్తాధిపత్యం ఆరోపణలు ఎదుర్కొంటుండంతో.. ఇతరత్రా హార్డ్‌వేర్‌ ఉత్పత్తులపైనా దృష్టి పెడుతున్న గూగుల్‌కు కూడా ఇది ఉపయోగపడనుంది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా