గూగుల్‌ సీఈవోకు సమన్లు

6 Aug, 2018 20:30 IST|Sakshi

వాషింగ్టన్‌: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి  నోటీసులు అందాయి. గూగుల్‌ సెర్చిఇంజీన్‌లో  చైనీస్ వెర్షన్‌  రూపొందించే ప్రణాళికలపై  సెనేటర్లు తీవ్రంగా  స్పందించారు. అమెరికా సెనేట్‌లోని ఆరుగురు సభ్యులు పిచాయ్‌కు సమన్లు జారీ చేశారు. పిచాయ్‌కు. తాజా మీడియా నివేదిలకపై  వివరణ ఇవ్వాల్సిందిగా  ఒక లేఖ రాశారు.  గుగుల్‌ నిర్ణయానికి కొత్తగా ఏం మారిందో చెప్పాలని  ప్రశ్నించారు. ఇదే నిజమైతే ఇది చాలా ప్రమాదకరమైన పరిణామంగా తమ లేఖలో పేర్కొన్నారు.

చైనాలో కఠినమైన సెన్సార్షిప్ నిబంధనల్లో 2010నుంచి కొత్తగా ఏది మారిందని సెనేటర్లు ఘాటుగా స్పందించారు. ఇంటెలిజన్స్ కమిటీ ఉపాధ్యక్షుడు వార్నర్, సెనేట్ ఫారిన్ రిలేషన్స్ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడైన ఫ్లోరిడా రిపబ్లికన్ రూబియో సహా పలు సెనేటర్లు   సుందర్‌ పిచాయ్‌ను ప్రశ్నించారు. గూగుల్‌కు సౌకర్యవంతమైన సహకారం అందించడానికి సంబంధించిన పరిస్థితులపై వారు లేఖలో ప్రశ్నించారు. ఇది చైనా ప్రభుత్వ కుట్ర అని సెనేటర్లు తప్పు పట్టారు.  చైనాలో గూగుల్‌ ప్రాజెక్ట్  ప్రమాదకరమైన చర్య అని  పేర్కొన్నారు.  అలాగే సెన్సార్‌షిప్‌ నిబంధనలకు లోబడి, ప్రధాన విలువలతో రాజీ లేకుండా వ్యవహరిస్తున్న ఇతర టెక్‌ కంపెనీలకు  ఆందోళనకర పరిణామమని వ్యాఖ్యానించారు.

కాగా చైనా కోసం గూగుల్‌ ఒక కొత్త సెర్చి ఇంజీన్‌ రూపొందించనుందనంటూ మీడియా నివేదికలు గత వారం  వెలుగులోకి వచ్చాయి. మరోవైపు  చైనాకు చెందిన చైనా సెక్యూరిటీస్ డైలీ గత వారం ఈ నివేదికలను తిరస్కరించింది.  ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్‌ కమ్యూనిటీ చైనాలో సొంతం. దాదాపు 772 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులున్నారు.

మరిన్ని వార్తలు