గూగుల్‌లో ఈ మార్పును గమనించారా?

16 Feb, 2018 13:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, టెక్నాలజీ : ఇంటర్నెట్‌ యూజర్లకు ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ షాక్‌ ఇచ్చింది. ఇకపై మీకు నచ్చిన ఫోటోలను ఇష్టమొచ్చినట్లు సేవ్‌ చేసుకోకుండా సెర్చింజన్‌లో మార్పులు చేసేసింది. ఫ్రీ ఫోటోలకు ఆస్కారం లేకుండా ‘వ్యూ ఇమేజ్‌’ బటన్‌ను తొలగించేసింది.

ఇంతకు ముందు గూగుల్‌లో ఏదైనా ఫోటోలను ఓపెన్‌ చేసినప్పుడు పక్కన విజిట్‌, షేర్‌లతోపాటు వ్యూ ఇమేజ్‌ ఆప్షన్‌ కూడా కనిపించేది. దానిని క్లిక్‌ చేస్తే ఆ ఫోటో ఓపెన్‌ అయ్యి సేవ్‌ చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే కాపీ రైట్స్‌ కారణం చెబుతూ ఇప్పుడు ఆ ఆప్షన్‌ను గూగుల్‌ తొలగించేసింది. ఇప్పుడు గూగుల్‌ లో కేవలం విజిట్‌, షేర్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి.

‘గూగుల్‌లో నేటి నుంచే కొన్ని మార్పులు చేశాం. వ్యూ ఇమేజ్‌ బటన్‌ను తొలగించేశాం అని, యూజర్లకు, ఆధారిత వెబ్‌సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఈ పని చేశాం’ అని ఓ ప్రకటనలో గూగుల్‌ పేర్కొంది. దీని ద్వారా విజిట్‌ పేజ్‌ బటన్‌ ద్వారా ఆధారిత వెబ్‌ సైట్‌కు యూజర్‌ వెళ్తాడు. తద్వారా తమ ఆదాయం పెంచుకునేందుకే గూగుల్‌ ఈ పని చేసినట్లు స్పష్టమౌతోంది. హై డెఫినేషన్‌ ఫోటోలు కావాలనుకుంటే తప్పనిసరిగా ఆ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సిందేనని గూగుల్‌ చెబుతుండగా.. ప్రత్యామ్నయ మార్గాలను కూడా వెతుక్కునే పనిలో యూజర్లు పడ్డారు.

మరిన్ని వార్తలు